ప్రిన్స్ మహేశ్‌బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ ఇటీవల కశ్మీర్లో పూర్తయింది. చిత్రీకరణ సమయంలో ఖాళీగా ఉన్న మహేశ్... తనయుడు గౌతమ్, దర్శకులు అనిల్ రావిపూడి, మెహర్ రమేశ్, వంశీ పైడిపల్లితో కలిసి క్రికెట్ ఆడాడు. సూపర్‌స్టార్ ఎంతో ఉత్సాహంగా ఆటలాడుతున్నప్పుడు తీసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
-
Superstar @urstrulyMahesh #Gautam @MeherRamesh @AnilRavipudi and @directorvamshi playing cricket @ #Kashmir 🏏 ⭐🏆🎫#SarileruNeekevvaru #HappyBirthdaySSMB #SSMB pic.twitter.com/95xA13kRY8
— Venkatesh V (@venkatesh_et) August 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Superstar @urstrulyMahesh #Gautam @MeherRamesh @AnilRavipudi and @directorvamshi playing cricket @ #Kashmir 🏏 ⭐🏆🎫#SarileruNeekevvaru #HappyBirthdaySSMB #SSMB pic.twitter.com/95xA13kRY8
— Venkatesh V (@venkatesh_et) August 9, 2019Superstar @urstrulyMahesh #Gautam @MeherRamesh @AnilRavipudi and @directorvamshi playing cricket @ #Kashmir 🏏 ⭐🏆🎫#SarileruNeekevvaru #HappyBirthdaySSMB #SSMB pic.twitter.com/95xA13kRY8
— Venkatesh V (@venkatesh_et) August 9, 2019
మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం "సరిలేరు నీకెవ్వరు" సినిమా ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో మహేష్‌బాబు ఆర్మీ అధికారి అజయ్ కృష్ణగా కనిపించనున్నాడు. రష్మిక మందణ్న కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న చిత్రం... వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకప్పటి అగ్ర కథానాయిక విజయశాంతి, నటుడు బండ్ల గణేశ్ ఈ చిత్రంతోనే మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు ఈ సినిమా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు.