ETV Bharat / sitara

మహేశ్​కు చాలా ఇష్టమైన ప్రాంతం ఇదే - మహేశ్​ బాబుకు బాగా ఇష్టమైన ప్రాంతం

'సర్కారు వారి పాట' సినిమా చిత్రీకరణ కోసం దుబాయ్​ వెళ్లిన హీరో మహేశ్​ బాబు.. ఆ ప్రాంతమంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. గతంలోనూ పలు సార్లు ఆ నగరాన్నిసందర్శించినట్లు వెల్లడించారు. కాగా, ఈ చిత్రంలో కీర్తి సురేశ్​ హీరోయిన్​గా నటిస్తోంది.

mahesh
మహేశ్​
author img

By

Published : Jan 31, 2021, 2:38 PM IST

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు మరికొన్ని రోజులపాటు దుబాయ్‌లోనే ఉండనున్నారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్‌ కథానాయిక. తాజాగా ఈ సినిమా షూట్‌ దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ క్రమంలోనే మహేశ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల దుబాయ్‌ చేరుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌లో కీర్తి సురేశ్‌, మహేశ్‌ పాల్గొంటున్నారు.

కాగా, లాక్‌డౌన్‌ అనంతరం సినిమా షూట్‌లో పాల్గొనడంపై మహేశ్‌ స్పందించారు. దుబాయ్‌ ఎంతో అందమైన ప్రాంతమని ఆయన అన్నారు. 'దుబాయ్‌ చాలా బాగుంటుంది. నాకు ఈ ప్రాంతమంటే చాలా ఇష్టం. గతంలో కూడా ఎన్నోసార్లు నేను దుబాయ్‌కు వచ్చాను. కరోనా పరిస్థితుల రిత్యా ఇక్కడ ఫాలో అవుతున్న నిబంధనలు చూస్తే మా చిత్రబృందం కూడా ఎంతో సేఫ్‌గా ఫీల్‌ అవుతోంది. వచ్చే నెలలో కూడా కొన్నిరోజులపాటు ఈ సినిమా షూట్‌ ఇక్కడే జరుగనుంది' అని ఆయన వివరించారు.

పవర్‌ఫుల్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో మహేశ్‌.. పొడవాటి జుట్టు, చెవిపోగుతో విభిన్నంగా కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు 14 రీల్స్‌ ప్లస్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తమన్‌ స్వరాలు అందించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఇదీ చూడండి: కుటుంబ కథతో అనుష్క కొత్త సినిమా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.