ETV Bharat / sitara

'మహాసముద్రం' షూటింగ్​ పూర్తి.. 'సోడా సెంటర్​' సాంగ్​ - శ్రీదేవి సోడా సెంటర్​ లిరికల్​ సాంగ్​

టాలీవుడ్​ నుంచి కొత్త సినిమా కబుర్లు​ వచ్చేశాయి. 'మహాసముద్రం'(Mahasamudram Telugu) షూటింగ్​ అప్​డేట్​ సహా 'హిట్​' రీమేక్(Hit Movie Remake), 'శ్రీదేవి సోడా సెంటర్​' తొలి లిరికల్​ వీడియో అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి. ​

Mahasamudram movie shooting completed - Chiranjeevi released manduloda song lyrical video
'మహాసముద్రం' షూటింగ్​ పూర్తి.. 'సోడా సెంటర్​' సాంగ్​
author img

By

Published : Jul 9, 2021, 12:00 PM IST

టాలీవుడ్​ హీరో శర్వానంద్ ​(Sharwanand), సిద్దార్థ్ నటిస్తున్న మల్టీస్టారర్ 'మహాసముద్రం' (Mahasamudram Telugu). 'ఆర్​ఎక్స్​ 100' ఫేమ్​ అజయ్​ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారంతో ఈ సినిమా షూటింగ్​ పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్రబృందం ఓ ఫొటోను షేర్​ చేసింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత సిద్ధార్థ్​​(Siddharth) తెలుగులో సినిమా చేయడం, దర్శకుడి తొలి సినిమా హిట్​ కావడం వల్ల ఈ మూవీపై సినీప్రియుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.

Mahasamudram movie shooting completed - Chiranjeevi released manduloda song lyrical video
'మహాసముద్రం' షూటింగ్​ పూర్తి

'హిట్​' రీమేక్​లో 'దంగల్​' బ్యూటీ

టాలీవుడ్​లో విడుదలైన మిస్టరీ థ్రిల్లర్ 'హిట్'. విశ్వక్​సేన్ (Vishwak Sen) హీరోగా చేయగా, శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకుడిగా పరిచయమయ్యారు. దీనికి వచ్చిన ఆదరణ చూసి, బాలీవుడ్​లోనూ తీసేందుకు నిర్మాతలు దిల్​రాజు, అల్లు అరవింద్ సిద్ధమయ్యారు. రాజ్​కుమార్ రావ్​తో (Rajkummar Rao) హిందీలో ఈ సినిమా రీమేక్ (Hit Movie Remake) చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో మరో కీలకపాత్ర కోసం సన్యా మల్హోత్రాను (Sanya Malhotra) ఎంపిక చేసింది చిత్రబృందం. ఇదే విషయాన్ని నిర్మాణసంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగా, త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. మరి శైలేష్​ అక్కడ కూడా 'హిట్​' కొడతారో లేదో చూడాలి.

సన్యా మల్హోత్రా

శైలేష్​ కొలను, రాజ్​కుమార్​ రావ్​

'సోడా సెంటర్​'లో సందడి

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తన మొదటి చిత్రం 'పలాస 1978'(Palasa 1978)తో దర్శకుడు కరుణ కుమార్‌ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అదే ఊపుతో దూసుకుపోతున్నారు. సుధీర్‌బాబు(Sudheer Babu) ప్రధాన పాత్రలో 'శ్రీదేవి సోడా సెంటర్‌'(Sridevi Soda Centre) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ సినిమాలోని తొలి లిరికల్​ సాంగ్​ 'మందులోడా'ను మెగాస్టార్​ చిరంజీవి విడుదల చేశారు. 'పలాస' చిత్రంలో 'నాది నక్కిలీసు గొలుసు' ఎంత పెద్ద హిట్​ అయ్యిందో 'మందులోడా' సాంగ్​ కూడా అంతే పెద్ద హిట్​గా నిలిచిపోతుందని మెగాస్టార్​ చిరంజీవి అన్నారు.

ఇదీ చూడండి.. Navarasa: 'నవరసా'ల టీజర్​ వచ్చేసింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.