తమిళ హీరో సూర్యపై ఎలాంటి కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోమని మద్రాస్ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నీట్ పరీక్షల భయంతో తమిళనాడుకు చెందిన నలుగురు విద్యార్థులు ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సూర్య, న్యాయమూర్తులను ఉద్దేశిస్తూ ట్వీట్లు చేశారు.
సూర్య వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని, అతడిపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. జడ్జిల నైతికతపై ఈ నటుడు ట్వీట్లు చేశారని పేర్కొన్నారు. ఈ విషయమై స్పందించిన న్యాయస్థానం.. సూర్య వ్యాఖ్యలు అనవసరం, సమర్థనీయం కానివని తెలిపింది. తమ పనితీరు గురించి మాట్లాడటం తగదని స్పష్టం చేసింది.