ETV Bharat / sitara

మధూర్ భండార్కర్ కొత్త చిత్రం 'ఇండియా లాక్​డౌన్'

బాలీవుడ్ దర్శకుడు మధూర్‌ భండార్కర్‌ కొత్త సినిమాను ప్రకటించారు. ఆ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.

Madhur Bhandarkar announces new film 'India Lockdown' based on true events
బాలీవుడ్​లో ‘'ఇండియా లాక్‌డౌన్’‌'
author img

By

Published : Dec 23, 2020, 5:55 PM IST

ప్రముఖ బాలీవుడు దర్శకుడు మధూర్ భండార్కర్ బుధవారం కొత్త చిత్రాన్ని ప్రకటించారు. టైటిల్​ను 'ఇండియా లాక్​డౌన్'గా ఖరారు చేశారు. భండార్కర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీజే మోషన్‌ పిక్చర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మూవీని వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ ఏడాది భారత్​లో విధించిన లాక్​డౌన్​ సమయంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా దీనిని రూపొందిస్తున్నట్లు తెలిపారు భండార్కర్.

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన 'రంగీలా' చిత్రంలో తొలుత అతిథి పాత్రలో కనిపించారు భండార్కర్. ఆ తర్వాత 'త్రిశక్తి', 'చాందినీ బార్'‌, 'సత్తా', 'కార్పోరెట్', 'ట్రాఫిక్‌ సిగ్నల్'‌ వంటి చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలతో పాటు రచయితగానూ పనిచేశారు. భండార్కర్‌ సినిమాల్లోని సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. 2017లో 'ఇందు సర్కార్‌' సినిమా తరువాత మధూర్‌ భండార్కర్‌ ఎటువంటి సినిమా చేయలేదు.

ఇదీ చూడండి: అనసూయ.. అదిరేటి పోజులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.