ETV Bharat / sitara

'పుష్ప' ఆఫర్​పై మాధవన్​ క్లారిటీ!​​ - allu arjun movie updates

సుకుమార్​ దర్శకత్వంలో అల్లు అర్జున్​ హీరోగా రానున్న చిత్రం 'పుష్ప'. ఇందులో మాధవన్​ విలన్​గా కనిపించనున్నట్లు ఇటీవలే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన మాధవన్..​ క్లారిటీ ఇచ్చారు.

pushpa
పుష్ప
author img

By

Published : Sep 30, 2020, 10:57 PM IST

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా దర్శకుడు సుకుమార్​ తెరకెక్కిస్తున్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ఎర్రచందనం దుంగల స్మగ్లర్‌గా కనిపించనున్నారు. అయితే ఇందులో మాధవన్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మాధవన్‌ స్పందిస్తూ.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. 'పుష్ప' చిత్రంలో తాను నెగటివ్‌ రోల్‌లో నటించడం లేదని క్లారిటీ ఇచ్చారు.

'అల.. వైకుంఠపురములో..' విజయం తర్వాత అల్లు అర్జున్‌ ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన​ చిత్తూరు యాసను నేర్చుకుంటున్నారు. 'ఆర్య', 'ఆర్య-2' చిత్రాల తర్వాత సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ఇందులో బన్నీకి జంటగా రష్మిక కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.