ETV Bharat / sitara

Madhavan: కెరీర్​ ఆరంభంలోనే మూడు భాషల్లో నటన! - మాధవన్​ బర్త్​డే

'సఖి', 'చెలి', '13 బీ' వంటి సినిమాలతో టాలీవుడ్​లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బహుభాషా నటుడు, రొమాంటిక్​ హీరో మాధవన్(Madhavan).​ ఈయన నేడు 51వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన గురించి పలు ఆసక్తికర విశేషాలు మీ కోసం..

Madhavan birthday special story
Madhavan: కెరీర్​ ఆరంభంలోనే మూడు భాషల్లో నటన!
author img

By

Published : Jun 1, 2021, 5:31 AM IST

సినీపరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే తన నవ్వుతోనే అందరినీ ఆకట్టుకున్నారు నటుడు మాధవన్‌(Madhavan). కథానాయకుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాత, రచయిత, గాయకుడిగానూ ప్రేక్షకాదరణ పొందారు. ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లో నటించి కుర్రకారు మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచి రొమాంటిక్​ హీరోగా పేరు గాంచారు మాధవన్​.

1970 జూన్‌ 1న పుట్టిన ఆయన అసలు పేరు మాధవన్‌ బాలాజీ రంగనాథన్‌. హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఆంగ్లం, మలై వంటి పలు భాషాచిత్రాల్లో నటించారు. తొలిసారిగా బాలీవుడ్‌లో 'ఇస్‌ రాత్‌ కీ సుభా నాహిన్‌' చిత్రంలో ఓ పాట పాడారు. తర్వాత 'ఇన్‌ఫెర్నో' అనే ఆంగ్ల సినిమాలో నటించారు. కన్నడలో 'శాంతి శాంతి శాంతి'లో హీరోగా చేశారు.

Madhavan birthday special story
మాధవన్

ఆరంభంలోనే మూడు భాషల్లో..

పరిశ్రమకు కొత్తగా వచ్చిన వెంటనే మూడు భాషల్లో అవకాశాలను అందుకున్న ఏకైక నటుడు మాధవన్‌ మాత్రమే. హిందీలో '3 ఇడియట్స్‌'తో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. 'తనూ వెడ్స్‌ మనూ'తో మంచి విజయాన్ని అందుకున్నారు.

దర్శకుడిగా 'రాకెట్రీ'..

హిందీ, తమిళంలో ఆయన నటించిన చాలా చిత్రాలు మంచి పేరు తెచ్చాయి. ఆయన నటించిన సినిమాలు తెలుగులోకీ డబ్బింగయ్యాయి. అందులో 'చెలి', 'సఖి'తో రొమాంటిక్‌ హీరోగా అభిమానులకు గుర్తుండిపోయారు. అనుష్కతో పాటు నటించిన 'నిశ్శబ్దం' చిత్రం గతేడాది ఓటీటీలో విడుదలైంది. మాధవన్​.. ప్రస్తుతం నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న 'రాకెట్రీ'.. ట్రైలర్​​ ఇటీవలే విడుదలైంది. రాకెట్ శాస్త్రవేత్త నంబీ నారాయణ్​ జీవితాధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ట్రైలర్​: మనిషిని కొట్టాలంటే దేశద్రోహి ముద్ర చాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.