'వినరా సోదరా' సినిమాతో హీరోగా మారిన శ్రీనివాస్ సాయి.. 'మథనం' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హైదరాబాద్‌లో సోమవారం టీజర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా దర్శకుడు సురేందర్‌రెడ్డి హాజరయ్యాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించాడు.
ఈ సినిమాతో డాన్సర్ అజయ్ సాయి మణికందన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. భావన హీరోయిన్. అశోక్ ప్రసాద్, దివ్య ప్రసాద్ నిర్మాతలు. గేమ్ ఓవర్ సినిమాకు సంగీతమందించిన రాన్ ఎహాన్ స్వరాలు సమకూర్చాడు.
"నేను 15 సంవత్సరాలు చీకటి గదిలో ఉన్నా.. ఇప్పుడు బయటకు రావడానికి కారణం ప్రేమ", "ప్రేమ... ఆలోచించుకోవడానికి అందంగా ఉంటుంది, దక్కించుకోవడానికి కష్టంగా ఉంటుంది", "ముందు వాడ్ని వాడికి పరిచయం చేయండి... లేదంటే మీకు మీ కొడుకు దక్కకుండా పోతాడు" అంటూ టీజర్‌లోని ఈ డైలాగ్‌లు సినిమాపై ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఇది చదవండి: ఏంజెలినా జోలీ తర్వాతి సినిమా ఇదే..