మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల (MAA Elections) ప్రచారం ఊపందుకున్న వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి(Saidharam Tej accident) గురవడంపై సినీ ప్రముఖులు విడుదల చేసిన బైట్లు చర్చనీయాంశంగా మారాయి. 'మా' అధ్యక్షుడు నరేశ్ (MAA President naresh)విడుదల చేసిన బైట్‌కు హీరో శ్రీకాంత్ కౌంటర్ ఇవ్వగా.. దానిపై నరేశ్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి బైట్స్ ఇంకోసారి ఇవ్వద్దన్నారు.
"సాయిధరమ్ తేజ్ స్పీడ్‌గా డ్రైవ్ చేయలేదు. ఇసుకలో జారి పడ్డాడు. గతంలో ఇచ్చిన బైట్‌కు మీడియాలో కాస్త తేడాగా వస్తే.. పెద్దలు నాకు ఫోన్ చేశారు. వెంటనే దాని గురించి ఏం చెప్పాలో అది చెప్పాను. బైట్స్ ఇచ్చే ముందు నువ్వు(శ్రీకాంత్) జాగ్రత్తగా ఉండాలి. అవతలి వాళ్ల మనోభావాలు దెబ్బతింటాయి. చనిపోయిన వారి గురించి నేను చెప్పలేదు. సాధారణంగా పరిశ్రమలో జరిగిందే చెప్పా. కానీ నువ్వు (శ్రీకాంత్) ఆ విధంగా మాట్లాడటం కాస్త బాధ అనిపించింది. దయచేసి ఇంకొకసారి ఇలాంటి బైట్స్ ఇవ్వొద్దు."
- నరేశ్, సీనియర్ నటుడు
ఈ క్రమంలో తన కళ్ల ముందే శ్రీకాంత్ హీరోగా ఎదగడం చూసినట్టు గుర్తు చేసుకున్నారు నరేశ్. అలాగే గత 'మా' ఎన్నికల్లో తన ప్రతిపక్ష ప్యానెల్లో శ్రీకాంత్ పోటీ చేసి ఓటమి పాలయ్యారని తెలిపారు .
ఇవీ చూడండి: