మంచు విష్ణు ప్యానెల్‌పై(manchu elections manchu vishnu) 'మా' ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్, జీవితా రాజశేఖర్‌తో(maa elections prakash raj) కలిసి ఈ కంప్లెయింట్ చేశారు. 'మా' ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఎన్నికల సహాయ అధికారి నారాయణరావుకు లేఖ అందించారు. పోస్టల్ బ్యాలెట్లలో మంచు విష్ణు(maa elections manchu vishnu panel) కుట్ర చేస్తున్నారని అన్నారు. 60 మందితో అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
"'మా'లో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతుంది. 60 ఏళ్లు పైబడిన నటీనటులు పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులు. ఏజెంట్ల ద్వారా పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ అర్హత ఉన్న సభ్యుల నుంచి విష్ణు ప్యానెల్ సంతకాలు సేకరిస్తుంది. నిన్న సాయంత్రం ఒక వ్యక్తి 56 మందికి పోస్టల్ బ్యాలెట్ డబ్బు కట్టారు. పోస్టల్ బ్యాలెట్‌లో ఓటు వేయాలంటే వ్యక్తిగతంగా 'మా'కు లేఖ రాసి డబ్బు కట్టాలి. ఆగంతకులతో 'మా' ఎన్నికలను నిర్వహిస్తారా? కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి వాళ్ల పోస్టల్ డబ్బులు కూడా మంచు విష్ణు తరఫు వ్యక్తే కట్టారు. కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలి."
స్పందించిన ఎన్నికల అధికారి
ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ వివాదంపై 'మా' ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. "కరోనా కారణంగా తొలిసారి పోస్టల్ బ్యాలెట్ పెట్టాం. 'మా'లో 60ఏళ్లు పైబడిన సభ్యులు 125మంది ఉన్నారు. ఇప్పటివరకూ 60మంది సభ్యులు పోస్టల్ బ్యాలెట్ కావాలని అడిగారు. సాయంత్రం 60మందికి పోస్టల్ బ్యాలెట్ పేపర్లు పంపిస్తాం. పోస్టల్ బ్యాలెట్ పేపర్‌కు నామినల్‌గా రూ.500 చెల్లించాలి. డబ్బు చెల్లించాల్సిన బ్యాంకు అకౌంట్ వివరాలు సభ్యులకు పంపాం. డబ్బు చెల్లింపుపై సీనియర్ సభ్యులకు అవగాహన లేదు. ఆ ప్రక్రియ కోసం మంచు విష్ణుకు వాళ్లు ఫోన్ చేశారట. దీంతో ఆయన తరపున ఒక వ్యక్తి వచ్చి ఆ మొత్తం డబ్బు చెల్లించారు. ఒకే వ్యక్తి డబ్బు చెల్లించటం నిబంధనలకు విరుద్ధం. పోస్టల్ బ్యాలెట్‌కు చెల్లించిన రూ.28వేలు తిరిగి ఇచ్చేశాం. ప్రస్తుత పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్ రద్దు చేసే అవకాశం లేదు. ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదుపై మధ్యాహ్నం నిర్ణయం తీసుకుంటాం" అని వివరణ ఇచ్చారు.
ఇదీ చూడండి: MAA Elections: 'మాపై ఆరోపణలు హాస్యాస్పదం'