నటిగా, సూపర్ మోడల్‌గా గుర్తింపు పొందిన లిసా రే... తాజాగా మేకప్ లేకుండా దర్శనమిచ్చింది. అంతేకాకుండా ఆ ఫొటో కింద తన మనసులోని భావాన్ని వ్యక్తం చేసింది. ఈ పోస్టు చదవిన అభిమానులు తన సహజసిద్ధమైన రూపానికి ఫిదా అయిపోతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
" 47 ఏళ్ల వయసులో నేను ఇలా ఉన్నాను. ఇది ఎడిట్ చేసిన ఫొటో కాదు. మనల్ని మనలా చూసుకునే ధైర్యం మనకుందా?. ప్రతి ఒక్కరూ మీ విలువను గుర్తించలేరు. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మహిళలూ... మీ విలువ తెలుసుకోగలిగితే ఈ ప్రపంచం కూడా మిమ్మల్ని ప్రకాశింపజేస్తుంది".
-- లిసా రే, బాలీవుడ్ నటి
తన ఫొటోకు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. లిసాను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
" నువ్వు ఎప్పటికీ బ్యూటిఫుల్. మీరు ఇలా కూడా బాగున్నారు. నేను మీ సందేశాన్ని స్వీకరిస్తున్నా. మీరు గ్రేట్ నిజంగా గ్రేట్. మీ మనసు, శరీరం రెండూ అందంగానే ఉన్నాయి" అని నెటిజన్లు తన పోస్టు కింద పేర్కొంటున్నారు.
ఈ ఏడాది లిసా తను రచించిన 'క్లోజ్ టు ది బోన్' పుస్తకాన్ని విడుదల చేసింది. అందులో తను క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడిన విధానం, చిత్ర పరిశ్రమలో నటిగా ప్రయాణం గురించి ప్రస్తావించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హీరోయిన్గా కన్నా రచయిత్రిని అవ్వాలనే ఎక్కువగా అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. మహేశ్‌బాబు 'టక్కరి దొంగ'తో తెలుగు తెరకు పరిచయమైంది లిసా. ఆ తర్వాత ఆమె టాలీవుడ్లో నటించలేదు. ప్రస్తుతం లిసా 'ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!' అనే సిరీస్‌లో నటిస్తోంది.
ఇదీ చదవండి...