ETV Bharat / sitara

ఆస్కార్ దర్శకుడితో 'ది లయన్ కింగ్' ప్రీక్వెల్

ఎంతగానో అలరించిన 'ది లయన్ కింగ్' సినిమాకు త్వరలో ప్రీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్టూడియోస్ వెల్లడించింది.

Lion King prequel in works, to be directed by Barry Jenkins
ఆస్కార్ దర్శకుడితో 'ది లయన్ కింగ్' ప్రీక్వెల్
author img

By

Published : Sep 30, 2020, 2:01 PM IST

హాలీవుడ్​ సూపర్​హిట్​ సినిమా 'ది లయన్ కింగ్'కు ప్రీక్వెల్ తీయనుంది ప్రతిష్టాత్మక వాల్ట్ డిస్నీ స్టూడియోస్. ఆస్కార్ అవార్డు పొందిన దర్శకుడు బేరీ జెంకిన్స్.. ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నారు. గతేడాది వచ్చిన 'ది లయన్ కింగ్' దర్శకుడు జెఫ్ నాథన్​సన్.. ప్రీక్వెల్​కు కథనందించారు.

అడవుల్లో సాగే కథ

అధునాతన సాంకేతికతతో ఆఫ్రికా అడవుల్ని తలపించేలా, నిజమైన జంతులనే భావన కలిగేలా 'ది లయన్ కింగ్' సినిమా తీశారు. ప్రధాన పాత్రలైన సింబా, నాలాకు ప్రముఖ నటుడు డొనాల్డ్ గ్లోవర్, నటీమణి బియోన్స్ గాత్రమందించారు. గతేడాది విడుదలై, పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంది.

భిన్నమైన పాత్రలు

ప్రముఖ నటుడు జేమ్స్ ఎర్ల్ జోన్స్ గొంతు అందించిన ముఫాస పాత్ర.. ఈ కథలో కీలకం. సింబా తండ్రి ముఫాసకు 1994, 2019లో తీసిన రెండు చిత్రాల్లోనూ జోన్స్ వాయిస్ ఇవ్వడం విశేషం. ప్రీక్వెల్​లో మాత్రం ముఫాస పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.