తమిళ సినీనటుడు విజయ్‌కి అభిమానులు చాలా మందే ఉన్నారు. అయితే.. కర్ణాటకకు చెందిన అభిమానులు విజయ్‌పై నిలువెత్తు అభిమానం చాటుకున్నారు. ఏకంగా పెద్ద విగ్రహాన్ని కట్టించి నటుడికి బహుమానంగా ఇచ్చారు.
![thalapathy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-che-07-vijay-statue-script-7205221_25072021162944_2507f_1627210784_117_2507newsroom_1627231322_860.jpg)
ఈ విగ్రహాన్ని చెన్నైలోని తనపనయ్యూర్ కార్యాలయంలో ఏర్పాటుచేయనున్నట్టు సమాచారం.
![vijay](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-che-07-vijay-statue-script-7205221_25072021162944_2507f_1627210784_862_2507newsroom_1627231322_117.jpg)
అయితే ఈ విగ్రహం వ్యవహారంపై విజయ్ స్పందించాల్సి ఉంది.
ప్రస్తుతం నటుడు విజయ్ 'బీస్ట్' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్లో ఈ చిత్రం నిర్మిస్తుండగా.. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు.
ఇదీ చదవండి:కార్తి పక్కనే ఉన్నా గుర్తుపట్టని విజయ్!