ETV Bharat / sitara

Manoj Bajpayee: పడి లేచిన కెరటంలా సాగిన సినీ ప్రయాణం!

అమితాబ్​ బచ్చన్​లా సినీ ఇండస్ట్రీలో స్టార్​గా ఎదగాలని ఆశతో ముంబయిలో అడుగుపెట్టి.. ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు మనోజ్ బాజ్​పాయ్​. కట్​ చేస్తే 'ఫ్యామిలీ మ్యాన్​' సిరీస్​తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణ నటుడిగా చిత్రసీమలో అడుగుపెట్టిన ఆయన ఇప్పుడు ఓ వెలుగువెలుగుతున్నారు. ఇలా పడిలేచిన కెరటంలా సాగిన మనోజ్​ బాజ్​పేయ్​ సినీ ప్రయాణం మీకోసం..

life journey of the family man star Manoj Bajpayee
పడి లేచిన కెరటంలా సాగిన సినీ ప్రయాణం!
author img

By

Published : Jun 23, 2021, 5:32 AM IST

జీవితంలో ఏదో సాధించాలని కలలు కంటాం. ఆ కలలు నిజం చేసుకునే క్రమంలో కాలం ఎన్నో కష్టాలు పెడుతుంది. ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆ కష్టాలు, కన్నీళ్లకు బెదరకుండా దాటొస్తేనే విజయం వరిస్తుంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌ కూడా 9 ఏళ్ల వయసులో అలాంటిదే ఓ కల కన్నాడు. అమితాబ్ బచ్చన్‌లా వెండితెర మీద వెలిగిపోవాలనుకున్నాడు. కట్‌ చేస్తే, 'ఫ్యామిలీ మ్యాన్‌'తో ఓటీటీ సూపర్‌స్టార్‌గా మారిపోయాడు. ఆ కలకు.. కట్‌కు మధ్య ప్రయాణం అంత సులువుగా ఏమీ సాగలేదు. పడుతూ లేస్తూ ఆయన తన కెరీర్‌ను మలుచుకున్న తీరు ఎందరో వర్థమాన నటులకు స్ఫూర్తిదాయకం.

అమితాబ్‌ బచ్చన్‌ అవ్వాలని..

మనోజ్‌ బాజ్‌పాయ్‌ బిహార్‌లోని ఓ సాధారణ రైతు కుటుంబంలో 1969లో పుట్టారు. ఆ ఊళ్లోనే ఉన్న గుడిసెలాంటి ఓ పాఠశాలలో చదువుకున్నారు. ఎప్పుడైనా సిటీకి వెళ్లినప్పుడు తండ్రి సినిమాలకు తీసుకెళ్లేవాడు. అలా 9 ఏళ్ల వయస్సులోనే అమితాబ్‌ బచ్చన్‌లా నటుడు కావాలన్న కోరిక తనలో బలంగా నాటుకుపోయింది. దాన్నే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. తండ్రికి మాత్రం మనోజ్‌ను డాక్టర్‌గా చూడాలని కోరిక. 17 ఏళ్ల వయస్సులో ఇంట్లో చెప్పకుండా వెళ్లి దిల్లీ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్‌ కోర్సులో జాయిన్‌ అయ్యాడు. అక్కడికెళ్లాకే ఇలా నటనకు సంబంధించిన కోర్స్‌లో చేరానని ఇంటికి ఉత్తరం రాశాడు. ఈ విషయం చెబితే కోపగించుకుంటాడని భయపడిన మనోజ్‌కు తండ్రి నుంచి అనూహ్యమైన స్పందనొచ్చింది. నెలకు సరిపడా ఖర్చులు పంపించడం సహా నటనలో ఎలాగైనా రాణించాలని సంకల్పించుకున్నారు.

నాలుగు సార్లు తిరస్కరణ

మనోజ్‌ దిల్లీ యూనివర్సిటీలో చేరాక హిందీ, ఇంగ్లీష్‌ భాషలపై పట్టు సాధించాడు. ఆ తర్వాత ప్రఖ్యాత నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. మొదటిసారి ఎంపికవ్వలేదు. మళ్లీ దరఖాస్తు చేశాడు. రెండోసారీ మొండిచేయే. ఇలా నాలుగు సార్లు దరఖాస్తు చేస్తే నాలుగు సార్లూ తిరస్కరణకు గురయ్యాడు మనోజ్‌. నటనే జీవితం అనుకుంటున్న ఆయనకు ఇదో పెద్ద దెబ్బలా అనిపించింది. ఆ సమయంలో ఆత్మహత్యకు కూడా యత్నించాడు. స్నేహితులు ఎప్పుడూ ఓ కంట కని పెడుతూ ధైర్యం చెప్పగా తిరిగి మళ్లీ నటన మీద ధ్యాస పెట్టాడు.

ముంబయి కష్టాలు

సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ముంబయిలో అడుగుపెట్టాడు. మొదట్లో అనేక కష్టాలు పడ్డాడు. ఏ స్టూడియోకు, ఆడిషన్‌కు వెళ్లినా తిరస్కరణే ఎదరయ్యేది. కొన్నిసార్లు మొదటి షాట్‌ అయిపోగానే గెటౌట్‌ అని బయటకు పంపేవారు. అద్దె కట్టుకోవడం కూడా మహాకష్టంగా గడిచిన రోజులవి. ఇలా నాలుగేళ్ల కష్టం తర్వాత మహేశ్‌ భట్‌ టీవీ సీరియల్లో అవకాశం దక్కింది. అందులో నటన నచ్చడం వల్ల శేఖర్‌ కపుర్‌ 'బ్యాండిట్‌ క్వీన్‌' (1994)లో చిన్న పాత్ర ఇచ్చారు. 'ద్రోహ్‌ కాల్‌'లో ఒక నిమిషం పాటు కనిపిస్తాడు. ఆ తర్వాత అన్నీ చిన్న పాత్రలే వరించేవి. సినిమాల్లో సరైన అవకాశాలు లేక డబ్బుల కోసం టీవీ సీరియల్స్‌లో నటించాల్సి వచ్చేది. 1998లో రామ్‌గోపాల్‌ వర్మను కలిశాక మనోజ్‌ బాజ్‌పాయ్‌ దశ మారిపోయింది.

'సత్య'తో సక్సెస్‌

రాంగోపాల్‌వర్మ 'క్షణం క్షణం'ను హిందీలో 'దౌడ్‌'గా రీమేక్‌ చేశారు. ఆ సినిమా ఆడిషన్‌ సమయంలో బాజ్‌పాయ్‌లోని ప్రతిభ.. వర్మకు విపరీతంగా నచ్చేసింది. అయితే 'దౌడ్‌'లో మరీ చిన్నపాత్ర ఇవ్వాల్సి రావడం ఆయనకు నచ్చలేదు. తదుపరి చిత్రంలో మంచి రోల్‌ ఇస్తానని మాటిచ్చాడు ఆర్జీవి. అలా బాలీవుడ్‌ క్లాసిక్‌ క్రైం డ్రామా 'సత్య' (1998)లో అవకాశం దొరికింది. ముంబయి మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్‌లో ఓ సంచలనం. అందులో గ్యాంగ్‌స్టార్‌ భీకూ మాత్రేగా నటించిన మనోజ్‌కు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు దక్కింది.

life journey of the family man star Manoj Bajpayee
'ది ఫ్యామిలీ మ్యాన్​ 2'

పడిలేచిన కెరటం

ఆ సినిమా తర్వాత పలు చిత్రాల్లో అవకాశాలు దక్కాయి. అయితే వాటికి సరైన గుర్తింపు రాకపోవడం, కమర్షియల్‌గా పరాజయం పాలవ్వడం వల్ల కొన్నాళ్ల పాటు కెరీర్‌‌లో ఒడుదొడుకులను ఎదుర్కొన్నాడు. 2010లో వచ్చిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ 'రాజ్‌నీతి'తో మళ్లీ కెరీర్‌ పుంజుకుంది. అది బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. అందులో వీరేంద్ర ప్రతాప్‌ సింగ్ పాత్రలో కట్టిపడేశాడు. అదే ఏడాది తెలుగు చిత్రం 'వేదం'లోనూ నటించాడు. షూటింగ్‌లో గాయం కారణంగా రెండేళ్లు నటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత 'అరక్షణ్', 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపూర్లో' సినిమాలతో మంచి పేరొచ్చింది. సర్దార్ ఖాన్‌గా నటించిన 'గ్యాంగ్స్‌ ఆఫ్ వాసేపూర్‌' చిత్రం అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పొందింది.

'ట్రాఫిక్', 'స్పెషల్‌‌ చబ్బీస్', 'ఆలీగఢ్‌', 'భోంస్లే', 'సత్యమేవ జయతే' ఇలా విజయవంతమైన చిత్రాల్లో విభిన్నపాత్రలు పోషిస్తూ మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత సినిమాల నుంచి వెబ్‌ సిరీస్‌లవైపు అడుగేశాడు. రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించిన 'ఫ్యామిలీ మ్యాన్‌' వెబ్‌ సిరీస్‌ తొలి సిరీస్‌ సూపర్‌ హిట్‌ అయింది. ఈ మధ్యే విడుదలైన రెండో సీజన్‌తో ఆయన స్టార్‌డమ్‌ మరింత పెరిగింది. ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లతో బిజీ అయిపోయిన మనోజ్‌.. నటనలో మూడు జాతీయ అవార్డులు, నాలుగు ఫిలింఫేర్‌ అవార్డులు గెలుచుకున్నాడు.

ఇదీ చూడండి.. The Family Man: అలరించిన పాత్రలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.