ఈ సారి ఈద్ కానుకగా బాలీవుడ్ ప్రేక్షకులకు 'లక్ష్మీబాంబ్'ను కానుకగా అందివ్వబోతున్నాడు అక్షయ్ కుమార్. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. కియారా అడ్వాణీ కథానాయిక.
దక్షిణాదిలో సూపర్ హిట్‌గా నిలిచిన 'కాంచన'కు హిందీ రీమేక్ ఇది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని రంజాన్ కానుకగా 2020 మే 22న విడుదల చేయనున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయిందని, కామెడీ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని చిత్రబృందం చెబుతోంది. తుషార్ కపూర్, షబీనా ఖాన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
సల్మాన్ ఖాన్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఇన్షాల్లా' ఈద్‌కే రావాల్సి ఉంది. పలు కారణాల వల్ల ఈ చిత్రం పండగ పోటీ నుంచి తప్పుకుంది. ఈ సినిమా ఆలస్యమైనా మరో చిత్రంతో ఈద్‌కు వస్తానని సల్మాన్ తెలిపాడు. తాజాగా ఈ బాలీవుడ్ కండలవీరుడు నటిస్తోన్న 'కిక్ 2'ను రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇవీ చూడండి.. ప్రియుడితో ఇలియానా బ్రేకప్...!