భారత ప్రముఖ గాయని లతా మంగేష్కర్(90).. శ్వాస సంబంధిత సమస్యతో ఇటీవలే ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే లత.. పరిస్థితి క్లిష్టంగా ఉన్నా నెమ్మదిగా కోలుకుంటున్నారని చెప్పారు.
"ఆమె(లత) పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. కానీ నెమ్మదిగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సనందిస్తున్నాం. కోలుకునేందుకు మరికాస్త సమయం పడుతుంది" -ఆసుపత్రిలో ఓ వైద్యుడు
అయితే లతా మంగేష్కర్ ప్రస్తుత పరిస్థితి సాధారణంగానే ఉందని ఆమె పీఆర్ విభాగం చెప్పింది. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.
లత.. తన ఏడు దశాబ్దాల కెరీర్లో వివిధ భాషల్లో 30 వేల పైచిలుకు పాటలు పాడారు. భారతీయ సినీ రంగంలో ఆమె అత్యుత్తమ ప్లేబాక్ సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు.
ఇది చదవండి: గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం.. కాస్త విషమంగానే!