కరోనా భూతం ప్రపంచం మొత్తాన్ని కబళిస్తున్న వేళ.. అడుగు బయటపెట్టడానికే అందరూ భయపడుతున్న ఈ క్లిష్ట సమయంలో.. కరోనా బారిన పడినవారిని కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు వైద్య సిబ్బంది. ఈ సంక్షోభ సమయాన గుండె ధైర్యంతో ఆపద్బాంధవుల్లా నిలిచిన వైద్యులతో పాటు ఇతర అత్యవసర సిబ్బందికి పలువురు సంఘీభావం తెలుపుతున్నారు. అలాగే కరోనాపై పోరాటానికి నిధులు సమకూర్చేందుకు ప్రఖ్యాత కళాకారులు ముందుకొచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు గ్లోబల్ సిటిజన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో గాయని లేడీ గాగా ఆధ్వర్యంలో ఓ సంగీత కచేరీ నిర్వహించారు. ఎవరింట్లో వారు ఉంటూనే ఆన్‌లైన్‌లో కచేరీని రక్తికట్టించారు.
'వన్ వరల్డ్: టుగెదర్ ఎట్ హోమ్' పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లేడీ గాగాతో పాటు నజాన్ లెజెండ్, శామ్ స్మిత్, షాన్ మెండెస్, కమిలా కాబెల్లో, టైలర్ స్విఫ్ట్, తదితర గాయకులు తమ పాటలతో అలరించారు. మరికొంత మంది సెలిబ్రిటీలూ ఇందులో పాల్గొని వివిధ అంశాలపై అవగాహన కల్పించారు.
భారత్ నుంచి షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా అందులో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 127.9 మిలియన్ డాలర్లు సమీకరించారు. దీనిపై ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో హర్షం వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి.. కరోనాపై కండలవీరుడి ర్యాప్ సాంగ్