ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థల్లో పని చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ రూపొందించిన చిత్రం 'క్షీరసాగర మథనం'. ప్రముఖ టెకీ అనిల్ పంగులూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 6న థియేటర్లలో విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం రంగం సిద్ధం చేసింది. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ చేతుల మీదుగా గురువారం (జులై 29) రాత్రి 8.08 గంటలకు ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడారు.
"మా చిత్రానికి మోరల్‌గా ఎంతో మద్దతు ఇచ్చిన నిర్మాత శరత్ కుమార్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన చేతుల మీదుగా మా చిత్రమైన 'క్షీరసాగర మథనం' ట్రైలర్ రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 6న సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నాం".
- అనిల్ పంగులూరి, దర్శకుడు
మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల మధ్య భావోద్వేగాలను ప్రస్పుటిస్తూ రూపొందించిన చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించారు. అక్షత సోనావని హీరోయిన్గా నటించగా.. ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.
వీరితో పాటు చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేశ్, అదిరే అభి, శశిధర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేశ్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి.
ఇదీ చూడండి.. 'క్షీరసాగర మథనం' పాట.. దర్శకుడు హరీశ్ శంకర్ ట్వీట్