ETV Bharat / sitara

సుశాంత్​తో కృతి సనన్​ డేటింగ్​ చేసిందా? - తాజా సుశాంత్​ వార్తలు

యువ హీరో సుశాంత్​ రాజ్​పుత్, కృతి సనన్​ ఒకప్పుడు డేటింగ్​లో ఉన్నారని నటి లిజా మాలిక్​ తెలిపింది. ఓ బర్త్​డే పార్టీకి హాజరైన సమయంలో వారిద్దరూ మంచి జంటలా కనిపించారని వెల్లడించింది.

Kriti Sanon dated Sushant Singh Rajput
సుశాంత్​, కృతి
author img

By

Published : Sep 19, 2020, 10:54 AM IST

Updated : Sep 19, 2020, 1:34 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్ సింగ్​ రాజ్​పుత్, నటి కృతి సనన్​ డేటింగ్​లో ఉన్నట్లు బహిరంగంగా చెప్పకపోయినా.. వారిద్దరూ మంచి రిలేషన్​లో ఉన్నారని నటి లిజా మాలిక్​ పేర్కొంది. వృత్తిపరంగా సుశాంత్​తో లిజాకు సంబంధం ఉంది. ఈ క్రమంలోనే ఓ బర్త్​డే పార్టీలో కృతితో కలిసి సుశాంత్​ ఆనందంగా గడపడం గమనించినట్లు తెలిపింది.

"సుశాంత్​ను చివరగా రెండేళ్ల క్రితం కృతితో ఉన్నప్పుడు కలిశా. బాంద్రా క్లబ్​లో కృతి పుట్టినరోజు వేడుక సందర్భంగా అక్కడికి వెళ్లాను. సాధారణంగా.. ఏదైనా విందు, పార్టీకి వెళ్లినప్పుడు.. ఎవరైతే ఆ పార్టీని ఏర్పాటు చేస్తారో వాళ్లు మాత్రమే వచ్చిన అతిథులకు మర్యాదలు చేస్తారు. పార్టీ ఏర్పాటు చేసిన వ్యక్తితోపాటు.. మరోవ్యక్తి కూడా అక్కడ హడావుడి చేస్తున్నారంటే.. వాళ్లిద్దరి మధ్య ఎవరికీ తెలియని అనుబంధం ఉందని అర్థం. అలాగే కృతిసనన్‌ బర్త్‌డే పార్టీకి వెళ్లినప్పుడు ఆమెతోపాటు సుశాంత్‌ సింగ్‌ కూడా వచ్చిన అతిథులకు సకల మర్యాదలు చేయడం మాత్రమే కాకుండా అందరితో మాట్లాడుతూ.. డ్రింక్స్‌ అందిస్తూ.. డ్యాన్స్‌ చేస్తూ కనిపించాడు. ఆరోజు సుశాంత్‌-కృతి సనన్‌ ముఖాల్లో ఎంతో సంతోషం కనిపించింది. వాళ్లిద్దరూ అంత ఆనందంగా ఉండడం చూస్తే రిలేషన్‌లో ఉన్నారని నాకు అనిపించింది. అదే సమయంలో వారిద్దరూ బయటకు చెప్పకపోయినా.. 'మేమిద్దరం డేటింగ్​ చేస్తున్నాం' అని అందరికీ తెలియజేసే ప్రయత్నం చేశారు."

-లిజా మాలిక్​, సినీ నటి

అయితే, కృతి సనన్​ ఇప్పటివరకు ఎప్పుడూ సుశాంత్​తో సంబంధం గురించి బహిరంగంగా స్పందించలేదు. వీరిద్దరూ కలిసి 2017లో 'రాబ్తా' చిత్రంలో నటించారు.

Last Updated : Sep 19, 2020, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.