ETV Bharat / sitara

అక్కినేని హీరోతో 'ఉప్పెన' బ్యూటీ! - సురేందర్ రెడ్డి చిత్రంలో కృతిశెట్టి

అక్కినేని అఖిల్​ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్​గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

Krithi Shetty to romance with Akkineni Akhil
అక్కినేని హీరోతో 'ఉప్పెన' బ్యూటీ!
author img

By

Published : Feb 9, 2021, 11:06 AM IST

వైష్ణవ్ తేజ్​తో కలిసి 'ఉప్పెన' చిత్రంలో నటించింది కృతి శెట్టి. ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 12) విడుదలవనుంది. అయితే ఈ మూవీ విడుదలవక ముందే కృతికి ఆఫర్లు వరుస కడుతున్నాయి. తాజాగా ఈ నటి మరో ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. అక్కినేని హీరో అఖిల్ సరసన హీరోయిన్​గా ఈ భామ ఎంపికైనట్లు టాలీవుడ్ టాక్.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. యాక్షన్ ఎంటర్​టైనర్​గా రూపొందుతోన్న ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్​గా చేయనుందట. హార్స్ రైడింగ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.