ETV Bharat / sitara

ఆ వార్తల్లో నిజం లేదు: 'ఉప్పెన' బ్యూటీ - బెల్లంకొండ గణేష్ కృతిశెట్టి

బాలీవుడ్​ మూవీ 'వివాహ్' తెలుగు రీమేక్​లో 'ఉప్పెన' బ్యూటీ​ కృతిశెట్టి నటిస్తుందన్న వార్తలపై సదరు హీరోయిన్​ స్పందించింది. ప్రస్తుతం తన చేతిలో ఉన్న మూడు సినిమాలు మినహా మరే చిత్రాలకు సంతకం చేయలేదని తేల్చిచెప్పింది. ఒకవేళ అంగీకరిస్తే తప్పకుండా తెలియజేస్తానంటూ సోషల్​మీడియాలో కృతి పోస్ట్​ పెట్టింది.

Krithi Shetty responds upon Vivah telugu remake
కృతిశెట్టి
author img

By

Published : May 18, 2021, 6:04 PM IST

Updated : May 18, 2021, 8:11 PM IST

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్​ కుమారుడు గణేశ్​ త్వరలోనే కథానాయకుడిగా సినిమాల్లో అరంగేట్రం చేయనున్నారు. బాలీవుడ్​ హీరో షాహిద్​ కపూర్​, అమృతారావు కలిసి నటించిన చిత్రం 'వివాహ్​' తెలుగు రీమేక్ ద్వారా తెరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన రీమేక్​ హక్కులను బెల్లంకొండ సురేశ్ ఇప్పటికే​ దక్కించుకున్నారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఇందులో గణేశ్​ సరసన 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి ఎంపికైందని సమాచారం. అయితే ఈ రూమర్లపై హీరోయిన్​ కృతిశెట్టి సోషల్​మీడియాలో స్పందించింది.

  • I am hearing a lot of rumours about my next projects. As of now I have signed 3 films in total (one with Nani garu, Sudheer Babu garu and Ram garu). Now my only concentration is to finish my commited projects. When I do sign my next projects, I will keep you posted for sure.

    — KrithiShetty (@IamKrithiShetty) May 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నేను నటించబోతున్న కొత్త చిత్రాలంటూ చాలా పుకార్లు వింటున్నాను. ప్రస్తుతం నేను మూడు సినిమాల్లో (నాని, సుధీర్​ బాబు, రామ్​ సినిమాల్లో) నటిస్తున్నాను. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ఆ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడమే. ఏవైనా సినిమాలకు సంతకం చేసినప్పుడు తప్పకుండా తెలియజేస్తాను".

- కృతిశెట్టి, హీరోయిన్​

సూరజ్‌ బర్జాత్య దర్శకత్వం వహించిన 'వివాహ్‌' (2006) చిత్రం అప్పట్లో తెలుగులోనూ 'పరిణయం' పేరుతో అనువాదమైంది. బెల్లంకొండ కుటుంబం ఈ మధ్య కాలంలో ఇతర భాషల సినిమాలకు సంబంధించిన రీమేక్‌ హక్కులను సొంతం చేసుకుంటున్నారు. తెలుగులో హిట్టయిన సినిమాలను హిందీలోనూ రీమేక్‌ చేస్తున్నారు.

కన్నడ భామ కృతి శెట్టి తొలి చిత్రం 'ఉప్పెన'లో తన నటనతో ఆకట్టుకొని వరుసగా సినీ అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం కృతి నానితో కలిసి 'శ్యామ్‌ సింగరాయ్‌'లో నటిస్తోంది. మరో హీరో సుధీర్‌బాబుతో కలిసి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. హీరో రామ్, లింగుస్వామి కాంబోలో రూపొందుతోన్న ఓ చిత్రానికీ సంతకం చేసింది.

ఇదీ చూడండి.. కరోనాతో అగ్రహీరోల మేకప్​మ్యాన్​ మృతి

Last Updated : May 18, 2021, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.