ETV Bharat / sitara

నవ్విస్తోన్న'మిమీ' ట్రైలర్.. మీరూ ఓ లుక్కేయండి - surrogacy movies bollywood

సరోగసీ(అద్దె గర్భం దాల్చటం) నేపథ్యంలో లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మిమీ'. కృతి సనన్, పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అలరిస్తోంది.

mimi trailer
మిమీ ట్రైలర్
author img

By

Published : Jul 13, 2021, 4:30 PM IST

కృతి సనన్, పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో రూపొందిన బాలీవుడ్‌ చిత్రం 'మిమీ'. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకుడు. దినేశ్‌ విజన్‌ నిర్మించిన ఈ చిత్రానికి ఎ.ఆర్‌. రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ మూవీ జులై 30 నుంచి జియో సినిమా, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.

అద్దె గర్భం నేపథ్యంలో..

'ఈ ప్రపంచంలో తల్లి, పిల్లల బంధమే చాలా గొప్పది' అని పంకజ్‌ చెప్పే సంభాషణతో ప్రారంభమైన ఈ ప్రచార చిత్రం ఆద్యంతం అలరిస్తోంది. సరోగేట్‌ తల్లిగా (అద్దె గర్భం దాల్చడం) కనిపించి ఆకట్టుకుంది కృతి.

అమెరికాకు చెందిన దంపతులు సరోగసీ విధానం ద్వారా పిల్లల్ని పొందాలనుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న పంకజ్‌.. కృతికి చెప్తాడు. ఈ పద్ధతి గురించి తెలుసుకుని షాక్‌ అవుతుంది కృతి. ఈ విషయంపై కృతి, పంకజ్‌ మధ్య సాగే సన్నివేశాలన్నీ సరదాగా సాగాయి. డబ్బు కోసం సరోగేట్‌ తల్లిగా మారేందుకు కృతి ఓకే అంటుంది. ఈ విషయంలో కృతి వాళ్లింట్లో తెలియకుండా ఉండేందుకు పంకజ్‌ ఓ ప్లాన్‌ వేస్తాడు. ఈ క్రమంలో పంకజ్‌ ఎన్నో నవ్వులు పూయించాడు. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో వాళ్లకో ట్విస్ట్‌ ఎదురవుతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'మాకు ఆ బేబీ అవసరం లేదు' అని అమెరికా దంపతులు నిర్ణయించుకుంటారు. కానీ, చివరగా కృతి బిడ్డకి జన్మనిస్తుంది. మరి ఆ బిడ్డని ఏం చేస్తారు? పంకజ్‌, కృతి మధ్య ఉన్న బంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఇదీ చదవండి: Salman Khan: 'టైగర్​ 3' కోసం విదేశాలకు సల్మాన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.