ETV Bharat / sitara

క్రిష్‌-వైష్ణవ్‌ చిత్రం విడుదల తేదీ ఖరారు! - Vaishnav tej movie release date

క్రిష్​-వైష్ణవ్​తేజ్​ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాను అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్ని జరుపుకొంటోంది.

vaishnav
వైష్ణవ్​
author img

By

Published : Aug 17, 2021, 5:35 PM IST

'ఉప్పెన' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే నటుడిగా మంచి గుర్తింపు పొందాడు వైష్ణవ్‌ తేజ్‌. అలా రెండో సినిమాతోనే ప్రముఖ దర్శకుడు క్రిష్‌తో పనిచేసే అవకాశం అందుకున్నాడు. అడవి నేపథ్యంలో సాగే విభిన్న కథ ఇది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను అక్టోబర్​ 8న విడుదల చేయాలని ప్రణాళిక రచిస్తున్నారు దర్శకనిర్మాతలు.

ఈ సినిమాలో వైష్ణవ్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సందడి చేయనుంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్ని జరుపుకొంటోంది. త్వరలోనే ప్రచారాన్ని మొదలుపెట్టనుంది చిత్రబృందం. టైటిల్‌ను ఇంకా ప్రకటించలేదు. అయితే 'కొండపొలం' అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న కారణంగా అదే పేరుని ఖరారు చేసే అవకాశాలున్నాయని చిత్ర వర్గాల్లో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల ఓ చిత్రాన్ని ఖరారు చేశాడు వైష్ణవ్‌ తేజ్‌. గిరీశయ్య దర్శకత్వంలో ఆయన నటించనున్నారు. కేతిక శర్మ నాయిక.

ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా 'హరిహర వీరమల్లు' చిత్రం తెరకెక్కిస్తున్నారు క్రిష్‌. పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ నాయిక.

ఇదీ చూడండి: ఇష్టం కాదు ఆమెనే ప్రేమిస్తున్నా: వైష్ణవ్​తేజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.