పవర్ స్టార్, సూపర్ స్టార్ బాక్సాఫీస్ వార్! - సంక్రాంతికి పవన్‌కళ్యాణ్ క్రిష్ సినిమా
వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న మహేశ్ సినిమా 'సర్కారు వారి పాట' రోజునే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పవన్‌కళ్యాణ్ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే బాక్సాఫీస్ వద్ద వీరిద్దరిలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

మహేశ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ బాక్సాఫీర్ వార్‌కు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మహేశ్ 'సర్కారు వారి పాట' సినిమా విడుదల కానుంది. అయితే ఇప్పుడు అదే పండగను పురస్కరించుకుని క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పవన్ సినిమా కూడా విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్‌ను శివరాత్రి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
ఒకవేళ ఈ సినిమా సంక్రాంతికి విడుదలైతే.. మహేశ్, పవన్ మధ్య ఏ రేంజ్లో పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి వీరిద్దరు తలపడతారా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి ఉండాల్సిందే.
ఇదీ చూడండి: మహేశ్‌కు చాలా ఇష్టమైన ప్రాంతం ఇదే