'జయహో పోలీస్.. యు ఆర్ ది వారియర్స్.. యు ఆర్ ది సేవియర్స్'.. అని అంటున్నారు టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి. ఇటీవల కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ 'వి గోనా ఫైట్ కరోనా ఏదేమైనా' అనే పాటను అలపించిన ఆయన.. తాజాగా పోలీసులపై ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు.
ప్రాణాంతక వైరస్ కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో మన సంక్షేమం కోసం కుటుంబాలను వదులుకుని పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి కృతజ్ఞతలు చెబుతూ, వారు చేస్తున్న సేవలకు సెల్యూట్ చేశారు కోటి. తనదైన శైలిలో పాట రూపొందించి ధన్యవాదాలు చెప్పారు. 'జయహో పోలీస్' అంటూ సాగే ఈ సాంగ్‌ను, సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">