ETV Bharat / sitara

హిందీ పాటకు కొరియా కుర్రాళ్ల స్టెప్పులు!

author img

By

Published : Jun 27, 2020, 8:41 PM IST

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఎంటర్​టైన్మెంట్​కు సామాజిక మాధ్యమాలు వేదికగా నిలుస్తున్నాయి. తాజాగా దక్షిణకొరియాలోని ఓ పాప్‌ బృందం చేసిన డాన్స్‌ వీడియోకు ఒక బాలీవుడ్‌ హిట్ సాంగ్‌ను జతపరిచారు. ఇప్పుడు ఈ వీడియోకు నెట్టింట విశేష ఆదరణ లభిస్తోంది.

Korean boys dance for hindi song
హిందీ పాటకు కొరియా కుర్రాళ్ల స్టెప్పులు!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల హవా కొనసాగుతోంది. నెటిజన్లు అనేక రకాల మీమ్స్‌తో పాటు ఒక వీడియోను మరొక ఆడియోతో జత చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా దక్షిణకొరియాలోని ఒక పాప్‌ బృందం చేసిన డాన్స్‌ వీడియోకు ఓ బాలీవుడ్‌ హిట్ సాంగ్‌ను జతపరిచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

రెండు దశాబ్దాల క్రితం కామెడీ డ్రామాగా తెరకెక్కిన 'బివి నెం.1' చిత్రంలో 'చున్నారీ చున్నాన్‌' అనే గీతానికి సల్మాన్‌, సుస్మితాసేన్ ఆడిపాడారు. ఆ పాట ఆడియోను 'కె-పాప్‌ బీటీఎస్'‌ బృందం కుర్రాళ్లు స్టెప్పులేసిన 'బాయ్‌ విత్‌ లవ్‌' అనే వీడియోకు జతపరచగా అది అద్భుతంగా సింక్‌ అయ్యింది. ఈ వీడియోను 'ఫిల్మ్‌ ఫర్‌ ఫేర్'‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా వారం క్రితం విడుదల చేయగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చాలా బాగా చేశారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ కేంద్రంగా కె-పాప్‌ బీటీఎస్‌ అనే బృందం 2010 నుంచి తమ డాన్స్‌ బీట్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. వారి పాటలకు కోట్లాది మంది అభిమానులున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.