సినీ తారల పెళ్లిళ్లపై ఊహాగానాలు సహజం. వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక వార్తలు వస్తుంటాయి. అలాగే మెగా హీరోయిన్ నిహారికకు అలాంటి అనుభవమే ఎదురైంది. కొంతకాలంగా ఈమెకు ప్రభాస్తో పెళ్లంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై స్పందించింది నిహారిక. ఆమె ఇటీవలే ఇన్స్టాలో అభిమానులతో ముచ్చటించింది. అందులో ఓ నెటిజన్ ప్రభాస్తో పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా అందులో నిజం లేదని స్పష్టం చేసింది.
మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా పరిచయమైన ఒకే ఒక్క అమ్మాయి నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె అయిన నిహారిక 2016లో 'ఒక మనసు' సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయమైంది. ఇటీవలే చిరంజీవి సినిమా 'సైరా'లో అతిథి పాత్రలో మెరిసింది.
ఇదీ చూడండి.. బాలీవుడ్ నటి కంగనపై పోలీసులకు ఫిర్యాదు!