కష్టాలు ఎదుర్కొంటేనే మన ఎదుగుదలకు ఓ అర్థం ఉంటుందని అంటోంది అందాల నటి కియారా అడ్వాణీ. 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తారను సినిమా అవకాశాలు అందిపుచ్చుకోవడంలో మీకు ఎదురైన ఇబ్బందుల గురించి చెప్పండని అడిగితే ఇలా వివరించింది.
"చాలా మంది నా మొదటి సినిమా 'ధోని' అని అనుకుంటారు. కానీ అంతకు ముందే 'ఫగ్లీ' చేశా. అది సరిగ్గా ఆడలేదు. దాని కోసం నేనెంతగా ఎదురు చూశానో నాకు తెలుసు. మొదటి చిత్రంతోనే నా జాతకం మారిపోతుందనుకున్నా. వర్కవుట్ అవ్వలేదు. రెండేళ్ల పాటు ఖాళీగానే ఉన్నా. ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నా. ప్రతిచోట మొండి చెయ్యే ఎదురయ్యేది. అవకాశం కోసం ఎంతో మందిని కలిశా. ఫలితం రాలేదు. ఇక చాలు... ఆపేద్దాం అని అనుకునే సమయంలో 'ధోని'లో అవకాశం వచ్చింది. ఇలా అవకాశాలు నాకు నేనే వెతుక్కున్నా. నా కష్టం నేనే పడ్డా. కానీ వీటన్నింటినీ ఎప్పుడూ ఇబ్బందులుగా భావించలేదు. ఆ మాత్రం కష్టాలు లేకపోతే మన ఎదుగుదలకు ఓ అర్థం ఉండదు" అని అని చెప్పింది కియారా.
త్వరలోనే 'ఇందూ కీ జవానీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందీ ముద్దుగుమ్మ.
ఇదీ చూడండి : అక్కడే ఆగిపోయే వ్యక్తిని నేను కాదు: కియారా