టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్‌తో నటి కిమ్ శర్మ(kim sharma) రిలేషన్లో ఉందంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. జులైలో వారిద్దరూ కలిసి గోవాకు విహారయాత్ర కోసం వెళ్లారు. ఈ జంట కలిసున్న ఫొటోలను అక్కడి రెస్టారెంట్ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ కూడా చేసింది. ఇప్పుడు ఆ వదంతులకు చెక్ పెడుతూ కిమ్, పేస్‌తో తన బంధం గురించి వెల్లడించింది. ఇన్‌స్టాలో అతడితో ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదే ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలోనూ పోస్ట్ చేసిన పేస్.. 'మ్యాజిక్' అనే క్యాప్షన్ రాసుకొచ్చాడు.
పేస్ కంటే ముందు కిమ్ శర్మ.. నటుడు హర్షవర్ధన్ రాణేతో(harshvardhan rane) రిలేషన్లో ఉంది. అలానే కిమ్‌తో రిలేషన్ కంటే ముందు లియాండర్, మోడల్ రియా పిళ్లైను(rhea pillai) పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ పాప కూడా ఉంది.
ఇవీ చదవండి: