'రాక్షసుడు' చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న రమేశ్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం 'ఖిలాడి'. యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమా తొలి ప్రచారచిత్రాన్ని ఉగాది కానుకగా విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో 'ఖిలాడి' ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి కథానాయికలుగా నటించగా వ్యాఖ్యాత అనసూయ కీలక పాత్ర పోషించింది. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
శర్వానంద్, సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మహాసముద్రం'. 'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ అజయ్‌భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అదితిరావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా కనిపించనున్నారు. తాజాగా అదితికి సంబంధించిన లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో మహా అనే పాత్ర చేస్తోంది అదితి. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ స్వరాలు అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.