ETV Bharat / sitara

ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాలు ఇవే! - ఖిలాడి

February 11 release movies: ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్​ మహారాజా రవితేజ 'ఖిలాడి', 'సెహరి', 'ఎఫ్​ఐఆర్​' సహా పలు చిత్రాలు శుక్రవారం(ఫిబ్రవరి 11) థియేటర్లలో రిలీజ్​ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. అవేంటో చూసేద్దాం.

telugu movie updates
వీకెండ్​ చిత్రాలు
author img

By

Published : Feb 10, 2022, 7:48 PM IST

Latest Movie Releases on February 11: కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత థియేటర్లలో సినిమా సందడి పెరిగింది. మరోవైపు ఓటీటీలలోనూ కొత్త సినిమాల జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం(ఫిబ్రవరి 11న) ప్రేక్షకులను అలరించేందుకు మరికొన్ని కొత్త మూవీస్ సిద్ధమయ్యాయి. అవేంటో చూసేద్దాం..

'ఖిలాడి'గా రవితేజ

ఈ సారి సినీప్రియులకు ఫుల్‌ కిక్‌ అందిస్తానంటూ దూసుకొస్తున్నారు కథానాయకుడు రవితేజ. రమేష్‌ వర్మ దర్శకత్వంలో మాస్​మహారాజా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఖిలాడి'. సత్యనారాయణ కోనేరు నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. అర్జున్‌, అనసూయ కీలక పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్​ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఎఫ్‌ఐఆర్‌' కథేంటి?

విష్ణు విశాల్‌ కథానాయకుడిగా నటిస్తూ, ఆయన స్వయంగా నిర్మించిన డార్క్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం 'ఎఫ్‌.ఐ.ఆర్‌'. మను ఆనంద్‌ దర్శకుడు. కథానాయకుడు రవితేజ సమర్పిస్తున్నారు. అభిషేక్‌ నామా ఈ మూవీని తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఉగ్రవాదం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ కథలో ఉగ్రదాడికి పాల్పడింది ఎవరు? ద్రోహి అనే ముద్ర ఎవరిపై పడిందనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మంజిమామోహన్‌, రెబా మోనికాజాన్‌ తదితరులు నటించారు.

ఫ్యామిలీ ఎంటర్​టైనర్​

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన చిత్రం 'సెహరి'. అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించారు. కోటి, అభినవ్‌ గోమఠం తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇది కూడా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది.

"ఇదొక చక్కని రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఇందులోని కథ, పాత్రలు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటాయి. హర్ష్‌ కొత్తవాడైనా అనుభవమున్న నటుడిలా చేశారు. ఉన్నత నిర్మాణ విలువలతో నిర్మించాం. ఈ సినిమా కుటుంబ సమేతంగా వెళ్లి హాయిగా చూడగలిగేలా ఉంటుంది" అని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌.విహారి, కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: అరవింద్‌ విశ్వనాథ్‌.

టిల్లు అన్న డీజే కొడితే..

"ఒక ల్యాండ్‌ ఉన్నది. అది మన సొంతము.. మన పర్సనల్‌ అనుకున్నా నేను.. కానీ, అది ఊళ్లో వాళ్ల అందరి పేరు పైనా ఉంది" అంటూ నవ్వులు పంచుతున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'డిజె టిల్లు'. నేహాశెట్టి నాయిక. విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 12న అభిమానులను పలకరించనుంది.

ఇప్పటివరకూ విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రిన్స్‌, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, మాటలు: సిద్ధు జొన్నలగడ్డ, ఛాయాగ్రహణం: సాయిప్రకాష్‌ ఉమ్మడిసింగు. వీటితో పాటు 'మహా ప్రళయం-2022' హాలీవుడ్‌ చిత్రం.. 'రచ్చ రచ్చ' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఓటీటీలో రిలీజ్​లు ఇవే..

ప్రియమణి 'భామాకలాపం'

ప్రియమణి కీలక పాత్రలో అభిమన్యు తెరకెక్కించిన చిత్రం 'భామా కలాపం' (BhamaKalapaam). క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా 'ఆహా'లో ప్రసారం కానుంది. గృహిణిగా, పక్కింట్లో జరిగే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపే మహిళగా ప్రియమణి ప్రచార చిత్రాల్లో కనిపించారు. ప్రతివారం ఓ కొత్త వంటకం చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసే ఆమె, తొలిసారి ఓ స్పెషల్‌ వంటకాన్ని చేయాల్సి వస్తుంది. అది ఏంటి? ఎందుకు చేయాల్సి వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ఇది 'ఆహా'లో స్ట్రీమింగ్‌ కానుంది.

రొమాంటిక్​ ఎంటర్​టైనర్​

బాలీవుడ్‌ నటులు దీపికా పదుకొణె- సిద్ధాంత్‌ చతుర్వేది, అనన్యా పాండే- ధైర్యా కర్వా కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్‌ చిత్రం 'గెహ్రాహియా'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ వేదికగా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ, స్నేహం, వ్యక్తిగత సంబంధాల వాటి పరిణామాల చుట్టూ కథను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలను బట్టి చూస్తే అర్థమవుతోంది. దీపిక-సిద్ధాంత్‌ ప్రణయ సన్నివేశాలతో సినిమాను హాట్‌హాట్‌గా తీర్చిదిద్దారు. కేవలం ఓటీటీ కోసమే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం.

'మళ్లీ మొదలైంది'

సుమంత్‌, వర్షిణీ సౌందర్‌ రాజన్‌, నైనా గంగూలి నాయకానాయికలుగా నటించిన చిత్రం 'మళ్లీ మొదలైంది'. టీజీ కీర్తి కుమార్‌ తెరకెక్కించారు. రాజశేఖర్‌ రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఓటీటీ వేదిక జీ5లో శుక్రవారం రిలీజ్​ కానుంది. "విడాకులు తీసుకున్న ఓ యువకుడు.. తన న్యాయవాదితో ఎలా ప్రేమలో పడ్డాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది ఈ చిత్ర కథాంశం. ఇందులో సుమంత్‌ భార్యగా వర్షిణీ కనిపించనుండగా.. న్యాయవాది పాత్రను నైనా పోషించింది" అని చిత్ర వర్గాలు తెలిపాయి. అనూప్‌ రూబెన్స్‌ ఈ మూవీకి సంగీతం అందించారు.

అప్పుడు థియేటర్లలో.. ఇప్పుడు ఓటీటీలో

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం 'హీరో'. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు, నటుడు మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్‌ హీరోగా పరిచయమైన సినిమా ఇది. నిధి అగర్వాల్‌ కథానాయిక. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. ఈ యాక్షన్‌ కామెడీ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది. 'డిస్నీ+ హాట్‌స్టార్‌'లో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్‌కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌

  • ఐ వాంట్‌ యూ బ్యాక్‌(హాలీవుడ్‌ ఫిబ్రవరి 11)

నెట్‌ఫ్లిక్స్‌

  • ఇన్వెంటింగ్‌ అన్నా (వెబ్‌ సిరీస్‌) ఫిబ్రవరి11
  • లవ్‌ అండ్‌ లీషెస్‌ (కొరియన్‌) ఫిబ్రవరి 11
  • టాల్‌ గర్ల్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి11
  • ద ప్రివిలేజి (హాలీవుడ్)ఫిబ్రవరి11

సోనీ లివ్‌

  • ఫ్రీడమ్‌ ఫైట్‌ (మలయాళం) ఫిబ్రవరి 11

ఎంక్స్‌ ప్లేయర్‌

  • రక్తాంచల్‌ (హిందీ) ఫిబ్రవరి 11

ఇదీ చూడండి : షూటింగ్​లో శివకార్తికేయన్.. కంగన 'లాక్ అప్' ఫస్ట్​లుక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.