టీజర్‌తోనే భారతీయ సినిమా ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించిన చిత్రం 'కేజీయఫ్: చాప్టర్2'. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. యావత్ సినీ ప్రపంచం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించింది. జులై 16వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది.
దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. సంజయ్‌దత్, రవీనా టాండన్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో 'కేజీయఫ్: చాప్టర్2' విడుదల కానుంది.
-
#KGFChapter2 Worldwide Theatrical Release On July 16th, 2021.#KGFChapter2onJuly16@TheNameIsYash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @prakashraaj @BasrurRavi @bhuvangowda84 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC @PrithvirajProd pic.twitter.com/ch1yq07TdA
— Hombale Films (@hombalefilms) January 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#KGFChapter2 Worldwide Theatrical Release On July 16th, 2021.#KGFChapter2onJuly16@TheNameIsYash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @prakashraaj @BasrurRavi @bhuvangowda84 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC @PrithvirajProd pic.twitter.com/ch1yq07TdA
— Hombale Films (@hombalefilms) January 29, 2021#KGFChapter2 Worldwide Theatrical Release On July 16th, 2021.#KGFChapter2onJuly16@TheNameIsYash @prashanth_neel @VKiragandur @hombalefilms @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 @prakashraaj @BasrurRavi @bhuvangowda84 @excelmovies @AAFilmsIndia @VaaraahiCC @PrithvirajProd pic.twitter.com/ch1yq07TdA
— Hombale Films (@hombalefilms) January 29, 2021
టీజర్‌తో రికార్డులు
యశ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. జనవరి 7న టీజర్‌ను విడుదల చేయగా, అతి తక్కువ సమయంలో 100 మిలియన్ వ్యూస్‌ను దాటిన ఘనత సాధించింది. ప్రస్తుతం 163 మిలియన్ల వీక్షణలకు చేరుకోగా.. 7.8 మిలియన్లకు పైగా లైక్స్ సొంతం చేసుకుంది.
ఆ ప్రశ్నలన్నిటీకీ సీక్వెల్‌తో సమాధానం
తొలి భాగంలో మిగిలిన అనేక ప్రశ్నలకు 'కేజీఎఫ్ 2' సమాధానం లభించనుంది. గరుడను చంపడానికి కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన రాకీ.. ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? కేజీఎఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్, కమల్, గురు పాండ్యన్, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు? గరుడ వేసిన ప్లాన్ ప్రకారం చనిపోయిన అధీరా ఎలా తిరిగొచ్చాడు? భారత దేశంలోకి ప్రవేశించడానికి ఇనాయత్ ఖలీద్ ఏం చేశాడు? కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాకీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇదీ చూడండి: మెగాస్టార్ 'ఆచార్య' టీజర్ వచ్చేసిందోచ్!