Nani Antey Sundaraniki Nazriya look: నేచురల్ స్టార్ హీరో నాని, నజ్రియా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం 'అంటే సుందరానికి!'. ఇందులో కేపీవీఎస్ఎస్పీఆర్ సుందర్ ప్రసాద్ అనే పాత్రలో నటిస్తున్నారు నాని. బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాలోని నజ్రియాను పరిచయం చేస్తూ 'ప్రేయర్ ఆఫ్ లీలా' పేరుతో ఓ ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇది ఆకట్టుకునేలా ఉంది. అయితే ఇది నాని పాత్రకు కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంది.
కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 2022 జూన్ 10న ఈ సినిమా విడుదల కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Heropanti 2 trailer: మంచి డ్యాన్సర్‌గా, ఫిట్నెస్ హీరోగా బాలీవుడ్లో స్టార్ గుర్తింపు తెచ్చుకున్న హీరో టైగర్ ష్రాఫ్. తెలుగులో అల్లుఅర్జున్ నటించిన 'పరుగు' సినిమా హిందీ రీమేక్ 'హీరోపంతి'తో వెండితెర అరంగేట్రం చేశాడు. 2014లో విడుదలైన ఈ సినిమా అతనికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత వరుస చిత్రాలతో జోరు చూపించాడీ హీరో. ప్రస్తుతం 'హీరోపంతి'కి సీక్వెల్ చస్తున్నాడు. ఈ సినిమా ఈద్ కానుకగా ఏప్రిల్ 29న ప్రేక్షకుల
ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను గురువారం విడుదల
చేసింది. సైబర్ క్రైమ్ నేపథ్యంలో యాక్షన్ హంగులతో ఈ చిత్రాన్ని
రూపొందించినట్టు ప్రచార చిత్రాన్ని చూస్తుంటే అర్థమవుతోంది. నవాజుద్దీన్
సిద్దిఖీ పోషించిన లైలా అనే పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన
హావభావాలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. సైబర్ దాడుల్లో సిద్ధహస్తుడైన
లైలాను చిత్తుచేసే బబ్లూ పాత్రలో టైగర్ ష్రాఫ్ కనిపించారు. ఇందులో టైగర్ స్టంట్స్, ఫైటింగ్ సీన్స్, విజువల్స్ అదిరిపోయాయి. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు 'గణపతి' అనే చిత్రంలోనూ 'టైగర్' నటిస్తున్నాడు.
KGF 2 update: 'కేజీఎఫ్' తొలి భాగం.. దేశవ్యాప్తంగా విడుదలై ఎంతగా సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా కొనసాగింపుగా ఏప్రిల్ 14న రానున్న 'కేజీఎఫ్ పార్ట్ 2' కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఆ వివరాల్ని మార్చి 18న చెప్తామని చిత్రబృందం వెల్లడించింది. మరి ఆ అప్డేట్ విశేషాలేంటో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగక తప్పదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'ఆర్ఆర్ఆర్' మారథాన్ క్యాంపైన్.. 7 రోజులు.. 9 నగరాలు