బాలీవుడ్‌లో విభిన్న సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాందించుకున్న నటుడు అక్షయ్ కుమార్. తాజాగా ఈ కథానాయకుడు నటించిన 'కేసరి’' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది. విడుదలైన మొదటి రోజు రూ.21 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా అదే ఊపులో బాక్సాఫీస్ దగ్గర నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
1897లో సిక్కు దళానికి చెందిన ఆర్మీ జవాన్లకు, అఫ్గాన్లకు పాకిస్థాన్‌లో ఉన్న సారాగర్హి దగ్గర జరిగిన యుద్ధం నేపథ్యంగా కేసరి చిత్రం తెరకెక్కింది. 21 మంది సిక్కు యోధులు పదివేల మంది అఫ్గానులను ఎలా ఓడించారనేదే కథ.
ఇవీ చూడండి..టాలీవుడ్ దర్శకులకు రెండో సినిమా సెంటిమెంట్..!