మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకనిర్మాత కేఆర్ సచిదానందన్ గుండెపోటుతో మృతి చెందారు. కేరళ త్రిశూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
కేరళ హైకోర్టులో లా ప్రాక్టీస్ చేస్తూనే సినీ రంగంలోను తన ప్రతిభ చాటుకున్నారు సచి. ఆయన దర్శకత్వం వహించిన రెండో చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఇందులో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, బిజూ మేనన్ ప్రధాన పాత్రలు పోషించారు.

తొలుత పృథ్వీరాజ్ హీరోగా వచ్చిన 'చాక్లెట్' చిత్రానికి కథనందించారు సచి. 2015లో విడుదలైన 'అనార్కలి' చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు.