కేరళ రాష్ట్ర 50వ సినిమా పురస్కార ప్రదానోత్సవం ముగిసింది. ఇందులో 'ఆండ్రాయిడ్ కుంజప్పన్' (తెలుగులో ఆండ్రాయిడ్ కట్టప్ప)లో నటనకుగానూ సూరజ్ వెంజరముడు ఉత్తమ నటుడిగా ఎంపికవ్వగా, 'బిరియాని' చిత్రంలోని పాత్రకు కని కుస్రుతి ఉత్తమ నటిగా అవార్డు కైవసం చేసుకున్నారు. ఇటీవల జరిగిన మాస్కో ఇంటర్నేషనల్ 42వ ఫిలిమ్ ఫెస్టివల్లోనూ కస్తూరి ఉత్తమ నటిగా ఎంపికవ్వడం విశేషం.
అలాగే 'జల్లికట్టు' సినిమాకుగానూ లిజో జోస్ పెల్లిస్సేరీ ఉత్తమ దర్శకుడిగా పురస్కారం అందుకున్నారు. రెహ్మన్ బ్రదర్స్ తెరకెక్కించిన 'వసంతి' చిత్రం ఉత్తమ సినిమాగా గుర్తింపు పొందింది.
అవార్డు పొందిన వారు
- ఉత్తమ చిత్రం (ప్రథమ) - వసంతి
- ఉత్తమ చిత్రం - (ద్వితీయ) - కెంజిరా
- ఉత్తమ నటుడు - సూరజ్ వెంజరముడు (ఆండ్రాయిడ్ కుంజప్పన్, వికృతి)
- ఉత్తమ నటి - కని కుస్రుతి (బిరియాని)
- ఉత్తమ దర్శకుడు - లిజో జోస్ పెల్లిస్సెరీ
- ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (పురుషులు) - ఫహాద్ ఫాజిల్ (కుంబలంగి నైట్స్)
- ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (మహిళలు) - స్వసిక (వసంతి)
- ఉత్తమ బాల నటుడు - వసుదేవ్ సంజీష్ మరా (సుల్లు, కల్లనోట్టమ్)
- ఉత్తమ బాల నటి - కేథరీన్ విజి (నాని)
- ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు - రథీష్ బాలకృష్ణన్ (ఆండ్రాయిడ్ కుంజప్పన్)
- ఉత్తమ సంగీత దర్శకుడు - సుశిన్ శ్యామ్ (కుంబలంగి నైట్స్)
- ఉత్తమ గాయకుడు - నజీమ్ అర్షద్
- ఉత్తమ గాయని - మధుశ్రీ నారయణన్
- స్పెషల్ జ్యూరీ - అన్నా బెన్ (హెలెన్)
నివిన్ పౌలీ (ముథూన్)
ప్రియమ్వదా క్రిష్ణ (తొట్టపన్)