చిరంజీవి 'ఆచార్య'తోపాటు మరో మూడు చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకొన్న సంగతి తెలిసిందే. అందులో 'వేదాళం' రీమేక్ ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో చిరుకి సోదరిగా కనిపించే కీలకమైన ఓ పాత్ర ఉంటుంది. ఆ పాత్ర కోసం సాయిపల్లవితోపాటు పలువురు కథానాయికల్ని పరిశీలించారు.
సాయిపల్లవి, కీర్తిసురేష్‌ల్లో ఎవరో ఒకరిని ఎంపిక చేయాలని చిత్రబృందం ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఎట్టకేలకు ఆ పాత్రలో నటించేందుకు కీర్తి పచ్చజెండా ఊపినట్టు సమాచారం. ఈ చిత్రంలో చిరు కొన్ని సన్నివేశాల్లో గుండుతో కనిపించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం ఇదివరకే మేకప్ టెస్ట్ కూడా చేశారు.
ఇదీ చదవండి:'శాకుంతలం'లో విలక్షణ నటుడు.. 'దుర్గ'లో లారెన్స్‌ను చూస్తే..