ETV Bharat / sitara

కీర్తి సురేశ్ తొలి సంపాదన రూ. వందల్లోనే! - కీర్తి సురేశ్ ఫస్ట్ శాలరీ

చిన్నప్పటి నుంచి సినిమాలు చేస్తున్న కీర్తి సురేశ్.. తన తొలి సంపాదన గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఓ ఫ్యాషన్​ షోలో పాల్గొన్నందుకు రూ.500 తీసుకున్నానని తెలిపింది.

keerthy suresh first salary
కీర్తి సురేశ్
author img

By

Published : May 3, 2021, 8:18 PM IST

'మహానటి' సినిమాతో సావిత్రి పాత్రకు ప్రాణం పోసి, మహానటి అనిపించుకుంది కీర్తి సురేశ్‌. తల్లిదండ్రులు సినిమా రంగానికి చెందిన వారే కావడం వల్ల బాల్యంలోనే కెమెరా ముందుకు వచ్చిందీ ముద్దుగుమ్మ. చిన్నప్పుడే పారితోషకం అందుకున్న కీర్తిని మీ తొలి సంపాదన ఎంత అని అడగ్గా ఓ ఇంటర్వ్యూలో ఆ ఆ విషయాన్ని వెల్లడించింది.

'నేను నటించినందుకు నిర్మాతలు నా చేతికి డబ్బుల కవర్ ఇచ్చేవారు. దాన్ని తీసుకుని నాన్నకు ఇచ్చేదాన్ని. ఇప్పటికీ ఆ డబ్బెంతో తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. కాలేజీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసేటపుడు ఒక షోల్లోనూ పాల్గొన్నాను. అలా ఓసారి రూ.500 తీసుకున్నాను. ఊహ తెలిశాక అందుకున్నది కాబట్టి ఇదే నా తొలి సంపాదనగా భావించాను. దీన్నీ సెంటిమెంట్‌గా నాన్నకే ఇచ్చేశాను' అని కీర్తి సురేశ్ చెప్పింది.

'రంగ్‌ దే'తో ప్రేక్షకుల్ని ఇటీవల పలకరించిన కీర్తి.. ప్రస్తుతం రజనీకాంత్‌ 'అన్నాత్తే', మహేశ్‌ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రాల్లో నటిస్తోంది. నాయికా ప్రాధాన్య చిత్రం 'గుడ్‌ లక్‌ సఖి' విడుదలకు సిద్ధంగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.