ETV Bharat / sitara

వీపుపై కత్తి.. చేతిలో తుపాకి.. కీర్తి లుక్​ అదుర్స్​ - keerthi suresh share screena with a director in tamil movie

హీరోయిన్​ కీర్తి సురేశ్​ నటించనున్న తమిళ చిత్రం 'సానీ కాయిధమ్​'కు సంబంధించి తాజాగా పోస్టర్​ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్​ కూడా నటించనున్నాడు. ఈ చిత్రానికి అరుణ్​ మాతేశ్వరన్​ దర్శకత్వం వహిస్తున్నాడు.

keerthi suresh
భుజంపై కత్తి.. చేతిలో తుపాకి.. కీర్తి లుక్​ అదుర్స్​
author img

By

Published : Aug 16, 2020, 6:27 PM IST

'మహానటి' కీర్తి సురేశ్ తమిళంలో మరో చిత్రానికి ఓకే చెప్పింది. అరుణ్‌ మాతేశ్వరన్‌ దర్శకత్వంలో 'సానీ కాయిధమ్​' అనే చిత్రంలో కీర్తి నటించనుంది. ఈ సినిమా కోసం నటుడిగా మారాడు సంచలన దర్శకుడు సెల్వ రాఘవన్‌. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఇందులో వీరిద్దరు గ్రామీణ లుక్‌లో కనిపిస్తుండగా.. కీర్తి చేతిలో గన్‌, సెల్వ చేతిలో కత్తి ఉంది. వీరి ముందు ఓ వాహనం రక్తంతో నిండి ఉండగా, ఆ వెనకాల మరికొంత మంది ఉన్నారు.

keerthi suresh
భుజంపై కత్తి.. చేతిలో తుపాకి.. కీర్తి లుక్​ అదుర్స్​

ఈ చిత్రం రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 1980లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన కీర్తి నటించిన 'గుడ్‌లక్ సఖి' టీజర్‌ సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. '7/జి బృందావన కాలనీ', 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే', 'యుగానికి ఒక్కడు' లాంటి వైవిధ్య చిత్రాలను తెరకెక్కించాడు దర్శకుడు సెల్వ రాఘవన్.

ఇది చూడండి 'మా మనసుల్లో ధోనీకి రిటైర్మెంట్ లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.