ETV Bharat / sitara

వారికి మద్దతుగా నిలవండి: కీరవాణి - కీరవాణి మల్టిపుల్ స్కెలెరోసిస్

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మల్టిపుల్ స్కెలెరోసిస్ అనే వ్యాధిపై అవగాహన కోసం ఓ సందేశం ఇచ్చారు. ఈ వ్యాధితో బాధపడేవారికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఎంతో అవసరమని ఆయన తెలిపారు.

Keeravani create awareness about Multiple Sclerosis
వారికి మద్దతుగా నిలవండి: కీరవాణి
author img

By

Published : Sep 22, 2020, 4:10 PM IST

Updated : Sep 22, 2020, 4:16 PM IST

కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానానికి ముందుకు రావాలంటూ పిలుపునిచ్చిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మరో వ్యాధిపైనా అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చారు. ఇటీవలే తనకు మల్టిపుల్‌ స్కెలెరోసిస్‌ అనే వ్యాధి గురించి తెలిసిందనీ, యోగా చేయడం, సంగీతం వినడం వంటి వాటితో ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చనీ అన్నారు. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను తన ట్విట్టర్​లో పంచుకున్నారు.

"ఇటీవలే ఎం.ఎస్‌.(మల్టిపుల్‌ స్కెలెరోసిస్‌‌) అనే వ్యాధి గురించి తెలిసింది. ఇది ఎవరికైనా, ఎప్పుడైనా, ఏ వయసు వారికైనా రావచ్చు. ఇది శరీరానికీ మెదడుకూ మధ్య ఉన్న అనుసంధాన వ్యవస్థను దెబ్బతీస్తుంది. మల్టిపుల్‌ స్కెలెరోసిస్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అనే సంస్థ దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎంతో కృషి చేస్తోంది. అంతేకాదు, ఈ వ్యాధి గురించి ప్రభుత్వానికి తెలిసేలా దీనిపై అవగాహన ఉన్న వారితో కలిసి తన గళాన్ని వినిపిస్తోంది. ఈ సందర్భంగా అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. ఈ సమస్యతో బాధపడే వారికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఎంతో అవసరం. యోగా సాధన, శ్రావ్యమైన సంగీతం ఇలా అన్ని మార్గాల్లోనూ వారిలో మనో ధైర్యాన్ని నింపేలా ప్రోత్సహించండి."

-కీరవాణి, సంగీత దర్శకుడు

ఇటీవల కరోనాను జయించిన ఎంఎం కీరవాణి తన కుమారుడితో కలిసి రెండోసారి ప్లాస్మా దానం చేశారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదనీ, అందరూ ధైర్యంగా అవసరమైన వారికి ప్లాస్మా దానం చేయాలనీ విజ్ఞప్తి చేశారు. కీరవాణి ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్'’తోపాటు, పవన్‌ కల్యాణ్‌-క్రిష్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Last Updated : Sep 22, 2020, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.