బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆమె కథానాయికగా వెండితెరకు పరిచయమైన 'కేదార్నాథ్' సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ జహన్ హండాతో డేటింగ్లో ఉందంటూ పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
హాలీడేలో భాగంగా ఓ బీచ్‌లో సారాతో కలిసి దిగిన ఫొటోలను ఇటీవల జహన్ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశాడు. అయితే.. ఈ పోస్ట్‌ను రీషేర్ చేస్తూ, 'ఐ లవ్ యూ.. మళ్లీ ఆ రోజులకు తీసుకు వెళ్లు' అని సారా రిప్లై ఇచ్చారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నమాట వాస్తవమేనని అందరూ అనుకుంటున్నారు. గతేడాది సారా పుట్టినరోజు సమయంలోనూ ఆమెకు సంబంధించిన పలు ఫొటోలను జహన్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు.
'కేదారనాథ్' చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సారా అలీఖాన్.. ఆ సినిమా షూటింగ్ సమయంలో హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌తో ఎంతో స్నేహంగా ఉన్నారు. దాంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ చెప్పుకున్నారు. కానీ వీరిద్దరూ ఆ విషయంపై ఎప్పుడూ పెదవి విప్పలేదు. అనంతరం, 'లవ్ ఆజ్కల్' సినిమా షూట్ సమయంలో నటుడు కార్తిక్ ఆర్యన్-సారా ప్రేమలో ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి.
ఇదీ చూడండి.. Puri Jagannadh: పటాయా బీచ్‌లో అది జరిగితే బాగుండు!