ETV Bharat / spiritual

దీర్ఘాయుష్షునిచ్చే 'బలిపాడ్యమి'- మహావిష్ణువును ఇలా పూజిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం! - BALI PADYAMI

దీర్ఘాయుష్షునిచ్చే బలిపాడ్యమి విశిష్టిత తెలుసుకుందాం

Bali Padyami In Telugu
Bali Padyami In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2024, 12:54 PM IST

How to do Bali Padyami Puja : వ్యాసమహర్షి రచించిన ప్రహ్లాద పురాణం ప్రకారం ప్రహ్లాదుని మనవడే బలి చక్రవర్తి. పరమ విష్ణుభక్తుడైన తాత ప్రహ్లాదుని ఒడిలో ఆటపాటలతో అతని బాల్యం గడవటం వల్ల బలి చక్రవర్తికి విష్ణుభక్తి అబ్బింది. అయితే రాక్షసులకు రాజైన కారణంగా వారిని పాలిస్తూ ఉండేవాడు. అత్యంత జనరంజకంగా పరిపాలన చేసే బలిచక్రవర్తి కాలంలో జనం సుఖసంతోషాలతో జీవించటం వల్ల 'నేను గొప్ప రాజును' అనే అహంకారం అతని మనసును ఆవరించింది. దీంతో ఒక మహాయాగం చేసి ఏకంగా ఇంద్రపదవిని చేపట్టాలని భావించాడు.

బలిని దానం కోరిన విష్ణువు
బలి చక్రవర్తి తాను చేపట్టిన యాగానికి ముల్లోకాల వారిని ఆహ్వానించి, విశేషంగా దానాలు చేసి సంతృప్తి పరుస్తాడు. శ్రీమహావిష్ణువు బలి చక్రవర్తి గర్వభంగం చేసేందుకు ఏడేళ్ల బ్రాహ్మణ బ్రహ్మచారి బాలుడిగా, గుండు, చిన్న గొడుగు, కమండలం తీసుకుని ఆ యాగస్థలికి వస్తాడు. ఆ బాలుడిని చూసిన బలి చక్రవర్తి అందరిలాగే ఇతనికి దానం ఇస్తానని అంటాడు.

శుక్రాచార్యుని హెచ్చరిక
రాక్షసుల రాజైన శుక్రాచార్యుడు 'దానాలు కోరుతున్నది శ్రీ మహావిష్ణువనీ, అతను రాక్షసులకు శత్రువనీ, కనుక ఈ బాలుడికి దానం ఇవ్వటం అంటే చావును కోరితెచ్చుకోవటమే' అని బలి చక్రవర్తిని హెచ్చరిస్తాడు. అందుకు బలి 'అదే నిజమయితే అంతకంటే అదృష్టమేమున్నది! అందరికీ అన్నీ ఇచ్చే విష్ణువుకు దానం చేయటం నాకెంత అదృష్టం' అంటూ గురువు వారించినా వినకుండా, వామనుడిని ఏం కావాలో కోరుకోమని బలి అడుగుతాడు. మూడు అడుగులు నేల ఇప్పించండని అంటాడు వామనుడు. 'సరే తీసుకో' అంటూ వామనుడి చేయి మీద చేయి పెట్టి జలం సాక్షిగా మూడడుగుల నేలను ధారపోస్తాడు.

ఇంతింతై వటుడింతై!
ఆశ్చర్యకరంగా మూడు అడుగుల ఆ బాలుడు ఆకాశమంత పెరిగిపోతాడు. ఆ త్రివిక్రముడు ఒక పాదం భూమ్మీద, మరో పాదం ఆకాశం మీద నిలిపి, 'మూడో అడుగు ఎక్కడ పెట్టాలి?' అనగా, బలి చక్రవర్తి మోకాళ్లమీద కూర్చొని నమస్కరించి 'స్వామీ నా తలపై పెట్టు' అని అనగా, వామనుడి రూపంలో ఉన్న విష్ణువు బలి తలపై పాదం మోపి అతడిని పాతాళానికి అణగదొక్కుతాడు.

పాతాళానికి రాజుగా బలి చక్రవర్తి
బలి చక్రవర్తి పాలనాపరంగా పుణ్యాత్ముడు కావడం వల్ల అతనిని పాతాళ చక్రవర్తిగా నియమించి, ఏదైనా వరం కోరుకోమని బలిని అడుగుతాడు. అప్పుడు బలి చక్రవర్తి తనకోసం కాకుండా మానవుల కోసం 'తాను దానం చేసిన మూడు అడుగులకు గుర్తుగా, ఏటా మూడు రోజులు ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక పాడ్యమి నాడు భూలోకానికి తాను రాజుగా ఉండేలా అనుగ్రహించమని కోరుతాడు. అంతేకాదు ఆ మూడురోజుల్లో ఎవరు దీపాలను వెలిగించి, దానం చేస్తారో వారికి సకల సంపదను అనుగ్రహించమని బలి విష్ణువును కోరగా విష్ణువు అనుగ్రహిస్తాడు.

అందుకే బలిపాడ్యమి పూజ
ఆ విధంగా తాను పాలించిన భూమిని చూసేందుకు ఈ మూడు రోజులు సాయంకాలం వేళ బలి చక్రవర్తి, విష్ణువుతో కలసి కలసి వస్తాడట. అందుకే ఈ మూడు రోజులు ఆ వేళకి ఇంటిముందు శుభ్రం చేసి, ముగ్గులు వేసి, దీపాలు పెడతారు. ఈ వేడుక చూసి తన ప్రజలంతా సంతోషంగా ఉన్నారని సంతోషపడి తిరిగి బలి పాతాళానికి వెళ్లే ఈ రోజునే బలి పాడ్యమి పేరుతో జరుపుకుంటున్నాం.

అందుకే బలిపాడ్యమి రోజు సాయంత్రం దీపాలు వెలిగించి, దానాలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. రానున్న బలిపాడ్యమి రోజు సాయంత్రం మనం కూడా దీపాలు వెలిగించి దానధర్మాలు చేద్దాం దీర్గాయుషును, అష్టైశ్వర్యాలను పొందుదాం. జై శ్రీమన్నారాయణ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.