ETV Bharat / entertainment

'సంక్రాంతికి వస్తున్నాం' అంటున్న వెంకీ మామ - ఇంట్రెస్టింగ్​గా మూవీ టైటిల్​! - VENKY ANIL RAVIPUDI 3

వెంకీ, అనిల్ రావిపుడి 3 టైటిల్ రివీల్ - ఆ పండుగ పేరును సినిమాకు పెట్టిన మేకర్స్!

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2024, 12:20 PM IST

Venky Anil Ravipudi 3 : టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్​, డైరెక్టర్ అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ టైటిల్​ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. దీపావళి సందర్భంగా విడుదల చేసిన ఓ స్పెషల్ పోస్టర్​లో ఈ విషయాన్ని వెల్లడించారు. 'సంక్రాంతికి వస్తున్నాం' అనే పేరును ఖరారు చేసినట్లు అనౌన్స్​ చేశారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

ఇక ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా కోలీవుడ్ నటి ఐశ్వర్య రాజేశ్​ నటిస్తుండగా, స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి మాజీ ప్రేయసిగా కనిపించనున్నారు. ఈ పోస్టర్​లో వాళ్ల లుక్ కూడా సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్​గా ఉన్నట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు.

'ఎఫ్‌ 2', 'ఎఫ్‌ 3' తర్వాత వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి కలిసి పనిచేస్తున్న సినిమా కావడం వల్ల అభిమానుల్లో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. గతంలో ఈ కాంబోలో వచ్చిన సినిమాలు కామెడీ ఎంటర్​టైనర్​గా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకున్నాయి.

ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విషయానికి వస్తే, దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో వెంకీతో పాటు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌ లీడ్​ రోల్స్​లో కనిపించనున్నారు. క్రైమ్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేశ్​ ఓ మాజీ పోలీసు ఆఫీసర్​గా కనిపించనున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్​గా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు వెంకటేశ్ తన నెక్స్ట్​ ప్రాజెక్ట్​ను 'విరాటపర్వం' ఫేమ్ వేణు ఊడుగులతో చేయనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో మేకర్స్ ఫైనల్ స్క్రిప్ట్​ను కూడా రెడీ చేస్తున్నారట. అంతా సెట్ అయితే 2025 కల్లా ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఓ మల్టీస్టారర్ అని, ఇందులో వెంకీతో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు కూడా కనిపించనున్నానరని సినీ వర్గాల టాక్. ఇక ఆ ఇద్దరు హీరోలతో పాటు ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్​మెంట్​ను మేకర్స్ త్వరలోనే రివీల్ చేయనున్నారట.

'తంగలాన్'​ దర్శకుడితో సూర్య - పొల్లాచ్చిలో వెంకీ పాట - Thangalan Director Suriya Movie

తొలి సినిమాకే నంది అవార్డు - వెంకీ చైల్డ్​ ఆర్టిస్ట్​గా చేసిన చిత్రం ఏదంటే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.