Pawan Kalyan Meets Farmer Naveen : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసేందుకు ఓ యువరైతు ఎడ్లబండి మీద సుదీర్ఘ ప్రయాణం చేపట్టిన విషయం తెలిసిందే. అన్నదాతలు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించేందుకు.. నవీన్ అనే రైతు ఏపీలోని సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోట నుంచి ఎడ్లబండి మీద ప్రయాణం మొదలు పెట్టారు. ఏకంగా 760 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, మంగళగిరికి చేరుకున్నారు.
ఈ ప్రయాణం పూర్తి చేయడానికి అతనికి సుమారు 28 రోజుల సమయం పట్టింది. మంగళగిరికి చేరుకున్న తర్వాత.. జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు మూడు రోజులుగా ఎదురు చూశారు. పవన్ ను కలిసేందుకు అవకాశం రాకపోవడంతో నవీన్ ఒక వీడియో రిలీజ్ చేశారు. జనసేన ఆఫీసు ఎదుట 3 రోజులుగా ఎదురు చూస్తున్నానని.. చలి, ఎండతో ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. అంతేకాకుండా చలి తీవ్రతతో తన రెండు ఎద్దుల్లో ఒక ఎద్దు అనారోగ్యానికి గురైందని ఆ రైతు వెల్లడించారు. అన్నదాతల కష్టాలను డిప్యూటీ సీఎంకు వివరించాలని, ఇందుకోసం పవన్ కల్యాణ్ కలిసేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
పవన్ కల్యాణ్ గురించి బాలయ్య ప్రశ్న - ఆసక్తికర సమాధానమిచ్చిన అల్లు అర్జున్
ఈ విషయాన్ని "ఈనాడు-ఈటీవీ" ప్రచురించింది. ఈ కథనంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. తనను కలిసేందుకు ఎడ్లబండి పైన వచ్చిన నవీన్ పవన్ కలిశారు. ఈ సందర్భంగా సమస్య ఏంటని అడిగారు. ఆ యువరైతు అన్నదాతలు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్లో సజావుగా అమ్ముకోలేక పోతున్నామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్య దళారుల తీవ్రత ఎక్కువగా ఉందని, వారి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు.
పవన్ కల్యాణ్ X ప్రకాశ్ రాజ్ - 'OG'లో ఇద్దరి మధ్య ఫైట్ సీన్?
యువ రైతు చెప్పిన సమస్యలపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పూర్తిగా వివరిస్తూ, తన కార్యాలయంలో ఒక వినతిపత్రం ఇవ్వాలనిని డిప్యూటీ సీఎం సూచించారు. రాష్ట్రపతి పర్యటన ఉన్నందు వల్ల ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నట్టు పవన్ కల్యాణ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి :
'అయ్యా పవన్ కల్యాణ్ సార్ - మీరే మాకు న్యాయం చేయాలి - మీ ఒక్కరి వల్లే అవుతుంది'
మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్ - పిఠాపురంలో మరో 12 ఎకరాల భూమి కొనుగోలు