Entire Venkatapuram Village Took TDP Membership : దివంగత నాయకుడు, పరిటాల రవీంద్ర స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని వెంకటాపురంలోని 100 శాతం ఓటర్లు టీడీపీ సభ్యత్వం తీసుకుని కొత్త చరిత్ర సృష్టించారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయతీ 225 పోలింగ్ బూత్ పరిధిలో వెంకటాపురం ఉంది. గ్రామ జాబితాలో మొత్తం 581 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 11 మంది చనిపోయారు. మిగిలిన 570 మందిలో అందరూ టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో వంద శాతం టీడీపీ సభ్యత్వం తీసుకున్న మొదటి గ్రామంగా వెంకటాపురం నిలిచిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. సభ్యత్వ నమోదులో హిందూపురం పార్లమెంటు రాష్ట్రంలోనే 2వ స్థానంలో ఉంది. పార్లమెంటు పరిధిలో కదిరి 69 వేల సభ్యత్వాలతో మొదటి స్థానంలో ఉండగా, 67 వేల సభ్యత్వాలతో రాప్తాడు 2వ స్థానంలో ఉంది. పార్లమెంటు పరిధిలో మొత్తం 4,29,071 మంది టీడీపీలో చేరారు.
'పసుపు'మయంగా మారిన ఆ గ్రామం - అసలు కథ ఏంటంటే? - TDP MEMBERSHIP IN VENKATAPURAM
టీడీపీ సభ్యత్వం తీసుకున్న వెంకటాపురంలోని మొత్తం ఓటర్లు - ప్రకటించిన స్థానిక ఎమ్మెల్యే
Published : Dec 17, 2024, 11:29 AM IST