అంతర్జాతీయ టోర్నీల్లో ప్రముఖ గాయకులు, నటులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకుంటారనే సంగతి తెలిసిందే. ఇలానే వచ్చే ఏడాది జరగబోయే ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో హాలీవుడ్ పాప్ గాయని కేటీ పెర్రీ అలరించనుంది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా వేదికగా పంచుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"మెల్బోర్న్లో రికార్డులు బద్దలవుతాయేమో చూద్దాం. 2020 మార్చి 8న మెల్బోర్న్లో నన్ను కలిసే సిద్ధంగా ఉండండి. ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ప్రదర్శన ఇవ్వనున్నా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలకు మద్దతుగా మనమందరం గొంతు కలపాలి" - కేటీ పెర్రీ ఇన్ స్టా పోస్ట్.
కేటీ ఒప్పందంతో ఈ వేడుకపై ఆసక్తి నెలకొంది. భారీ స్థాయిలో అభిమానులు వస్తారని నిర్వహకులు అంచనా వేస్తున్నారు. 1999లో అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా జరిగిన ఫిఫా మహిళల ప్రపంచకప్ ఫైనల్కు ఎక్కువ సంఖ్యలో 90, 185 మంది వచ్చారు. మెల్బోర్న్ క్రికెటర్ గ్రౌండ్లో లక్ష మంది పట్టే సామర్థ్యముంది.
ఇదీ చదవండి: ఈడెన్లో డే/నైట్ టెస్టు మ్యాచ్ సమయం ఖరారు..