హాలీవుడ్ పాప్‌స్టార్ కెటీ పెర్రీ... ముంబయిలో ఇచ్చిన తొలి సంగీత విభావరి అద్భుతంగా జరిగింది. శనివారం రాత్రి డీవై పాటిల్ స్టేడియంలో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. 'ప్రింటెడ్ ఆఫ్ షోల్డర్ జంప్' సూట్‌లో మెరిసిందీ ప్రముఖ గాయని. తన ఆల్బమ్‌లోని పాపులర్ గీతాల్ని పాడి అభిమానులను అలరించింది. 'లాస్ట్ ఫ్రయిడే నైట్', 'సూపర్ నేచురల్', 'ఐ కిస్ ఎ గర్ల్', 'రోర్ అండ్ ఫైర్ వర్క్'.. వంటి హిట్ సాంగ్స్‌తో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది.
ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ మారాయి. ఇదే సంగీత విభావరిలో మరో పాపులర్ సింగర్ డువా లిపా కూడా ప్రదర్శన ఇచ్చింది. రెండు రోజుల క్రితమే ముంబయికి వచ్చిన కెటీ, డువా... పలువురు సినీ ప్రముఖుల్ని కలిసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
చెన్నైవేదికగా 2012 జరిగిన ఐపీఎల్ ఆరంభోత్సవానికి హాజరైన పెర్రీ... తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆ వేడుకలో బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్, ప్రియాంక చోప్రా, అమితాబ్ బచ్చన్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత మళ్లీ 7 ఏళ్లకు ముంబయిలో ప్రదర్శన కోసం భారత్‌కు వచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">