ETV Bharat / sitara

విక్కీ-కత్రినా పెళ్లి వీడియో.. రూ.80 కోట్లకు ఆ ఓటీటీ సొంతం! - Vicky Kaushal marriage

కళ్లు చెదిరే మొత్తానికి ఓ ఓటీటీ సంస్థ.. విక్కీ-కత్రినా పెళ్లి వీడియోను సొంతం చేసుకుందట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్​గా మారింది.

Katrina Kaif, Vicky Kaushal
విక్కీ కౌశల్ కత్రినా కైఫ్
author img

By

Published : Dec 8, 2021, 6:15 PM IST

బాలీవుడ్​ లవ్​బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా కైఫ్.. డిసెంబరు 9న పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే రాజస్థాన్​ చేరుకున్న ఇరువురు కుటుంబసభ్యులు.. పెళ్లి ముందు పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ వేడుకకు సంబంధించిన ఓ విషయం నెటిజన్లు ఆశ్చర్యపరుస్తోంది.

నాలుగు రోజుల పాటు జరిగే విక్కీ-కత్రినా పెళ్లి పూర్తి వీడియో హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్​ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందట. ఇందుకోసం దాదాపు రూ.80 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది నెటిజన్లకు అందుబాటులో రానుందని సమచారం.

Katrina Kaif, Vicky Kaushal marriage card
విక్కీ-కత్రినా పెళ్లి కార్డ్

ఓటీటీకి తమ పెళ్లి ఫుటేజ్​ విక్రయించిన కారణంగా.. ఈవెంట్​కు వచ్చే అతిథులు అందరూ ఎన్​డీఏ నిబంధనపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా పెళ్లి మండపానికి ఫోన్​ తీసుకురాకూడదు. ఈ మేరకు విక్కీ-కత్రినా ఓ స్పెషల్​ నోట్​ కూడా ఇచ్చారు.

"ఈ ఈవెంట్​కు సంబంధించిన ఎలాంటి ఫొటోలు తీయడం గానీ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. మొబైల్స్​ను మీ గదుల్లో విడిచిపెట్టి రండి" అని నోట్​లో పేర్కొంది.

రాజస్థాన్​లోని సిక్స్​ సెన్సెస్​ ఫోర్ట్​లో హిందూ సంప్రదాయం ప్రకారం డిసెంబరు 9న విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ పెళ్లి జరుగుతుంది. కానీ ప్రోగ్రామ్స్ మాత్రం డిసెంబరు 4-12 తేదీల వరకు ఉంటాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.