బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్.. ఓ భారీ స్థాయిలో జరిగిన పెళ్లి వేడుకలో సందడి చేసింది. దేహ్రాదూన్‌లోని ఔలీ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు పెట్టి ఈ వివాహ వేడుకను ఏర్పాటుచేసింది. ఈ వేడుకలో నృత్యం చేసేందుకు కత్రినా కైఫ్‌తో పాటు పలువురు టీవీ ప్రముఖులకు పిలుపు అందింది.
ఈ కార్యక్రమంలో ‘తీస్ మార్ ఖాన్’ సినిమాలోని ‘షీలా కి జవానీ’ పాటకు డ్యాన్స్ చేసి అలరించింది కత్రినా. ఇప్పుడా వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెతో పాటు వధూవరులు వేదికపై సందడి చేశారు. బుల్లి తెర నటి సురభీ జ్యోతి కూడా నర్తించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇటీవల విడుదలైన ‘భారత్’ సినిమాతో కత్రినా విజయం అందుకుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్‌కు జోడీగా ‘సూర్యవంశీ’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.
ఇది చదవండి: వయసు పెరిగినా.. జోరు తగ్గించని సల్మాన్!