ETV Bharat / sitara

స్టేజ్​పైనే.. కాబోయే భార్యకు కార్తికేయ ప్రపోజ్​ - రాజా విక్రమార్క ట్రైలర్​

'రాజా విక్రమార్క' సినిమాతో(Rajavikramarka movie release date) నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు రానున్నారు హీరో కార్తికేయ. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో చిత్ర విశేషాలను చెప్పిన ఆయన తనకు కాబోయే భార్యను వేదికపైకి పిలిచి పరిచయం చేశారు. ఇకపై ప్రతి సినిమా కథాంశం ప్రేక్షకులు గర్వపడేలా ఎంచుకుంటానని చెప్పారు.

karthikeya
కార్తికేయ, లోహిత
author img

By

Published : Nov 7, 2021, 6:43 AM IST

Updated : Nov 7, 2021, 11:24 AM IST

"నా జీవితంలో హీరో కావడానికి9karthikeya raja vikramarka) ఎంత కష్టపడ్డానో అంత కష్టపడి ఓ అమ్మాయిని ప్రేమించి ఒప్పించుకున్నా. అప్పుడే తనకు 'నేను హీరో అవుదామని అనుకుంటున్నా, అయ్యాక మీ ఇంట్లో వచ్చి అడుగుతా'నని చెప్పా. నేను హీరో అయ్యి... చివరికి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నా. ఈ నెల 21న(Rajavikramarka movie release date) నా పెళ్లి" అంటూ తనకి కాబోయే భార్య లోహితని పరిచయం చేశారు యువ కథానాయకుడు కార్తికేయ.

karthikeya
కార్తికేయ, లోహిత

ఆయన నటించిన తాజా చిత్రం 'రాజా విక్రమార్క'(karthikeya raja vikramarka). తాన్యా రవిచంద్రన్‌ కథానాయిక. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించారు. ఆదిరెడ్డి, రామారెడ్డి నిర్మాతలు. ఈ నెల 12న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విడుదలకు ముందస్తు వేడుక జరిగింది. యువ కథా నాయకులు సుధీర్‌బాబు, శ్రీవిష్ణు, విష్వక్‌సేన్‌, కిరణ్‌ అబ్బవరం ముఖ్య అతిథులుగా హాజరై బిగ్‌ టికెట్‌ను ఆవిష్కరించారు.

karthikeya
కార్తికేయ, లోహిత

ఈ సందర్భంగా కార్తికేయ(karthikeya upcoming movies) మాట్లాడుతూ "ఈ సినిమా పేరు వినగానే గుర్తొచ్చేది చిరంజీవి సర్‌. ఆయన పేరు నా సినిమాకు పెట్టుకునే స్థాయి నాకు లేదు. చిన్నప్పట్నుంచి ఆయన సినిమా ఏది చూసినా అభిమానులుగా అందులో మనల్ని మనం ఊహించుకుంటాం. ఆయన పేరు పెట్టుకోవడానికి ఆ అభిమానానికి మించిన అర్హత లేదనుకున్నా. దర్శకుడు ముందు వేరే పేరు అనుకున్నప్పుడు, నేనే ఈ పేరును సూచించా. మొదట్నుంచీ నాకు ఇది నాకు చాలా ప్రత్యేకమైన సినిమాగా భావించా. ఈ చిత్రం విజయం నామీద నాకు విశ్వాసాన్ని ఇస్తుంది. ఇకపై ప్రతి సినిమా కథాంశం ప్రేక్షకులు గర్వపడేలా ఎంచుకుంటా. ఈ బృందంతో మళ్లీ పనిచేయాలని ఉంది?" అన్నారు. అనంతరం తనకు కాబోయే భార్యను వేదికపైకి పిలిచి పరిచయం చేశారు. వేదికపై నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగారు. కార్యక్రమంలో దిల్‌రాజు, సంగీత దర్శకుడు ప్రశాంత్‌ ఆర్‌.విహారి, జశ్విన్‌ ప్రభు, కృష్ణకాంత్‌, హర్షవర్ధన్‌, నవీన్‌, సనారె తదితరులు పాల్గొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'ఆయన పట్టుదల, క్రమశిక్షణే నాకు స్ఫూర్తి'

Last Updated : Nov 7, 2021, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.